Indonesia Earthquakes: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ భయంలో ప్రజలు!
ఇండోనేషియాలోని తనింబార్ దీవుల్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. ఇండోనేషియా "రింగ్ ఆఫ్ ఫైర్" లో ఉండటంతో భూకంపాలు సర్వసాధారణం. ఈ ప్రాంతం భూకంపలకు ప్రసిద్ధి చెందింది.

ఆగ్నేయ ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో సోమవారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటివరకు ఎటువంటి సునామీ ముప్పు జారీ కాలేదని GFZ వెల్లడించింది. జనవరి 2023లో తనింబర్ దీవులలో 7.6 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం గంటల తరబడి సునామీ హెచ్చరికను జారీ చేసింది. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు రెండు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
తానింబర్ దీవులు తూర్పు ఇండోనేషియాలో మలుకు ప్రావిన్స్ పరిధిలో ఉన్న దాదాపు 30 ద్వీపాల సమూహం. అవి పశ్చిమాన తైమూర్, తూర్పున న్యూ గినియా మధ్య అరాఫురా సముద్రంలో ఉన్నాయి. ఇండోనేషియా, 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒక ద్వీపసమూహంలో విస్తరించి, పసిఫిక్ ” రింగ్ ఆఫ్ ఫైర్ ” వెంబడి ఉంది. ఇది తీవ్రమైన భూకంప కార్యకలాపాల జోన్. ఈ దేశం 120 క్రియాశీల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంది. తరచుగా భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీలు ఇక్కడ వస్తుంటాయి.
Did you feel the Earth move this afternoon? We recorded an earthquake with a preliminary magnitude of 6.7 at 14:49 local time in the Tanimbar Islands Region, Indonesia. Fill in a felt report 👉 https://t.co/qfBQUzrHZJ. pic.twitter.com/A3Ku6PZLdl
— Geoscience Australia (@GeoscienceAus) July 14, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
