ఆఫ్ఘన్ దళాల దాడుల్లో 30 మంది పాకిస్తానీ అల్-ఖైదా ఉగ్రవాదుల మృతి… ఇంకా..

| Edited By: Phani CH

Aug 08, 2021 | 10:01 AM

ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా తాలిబాన్లపై విరుచుకపడ్డాయి. తాము జరిపిన వైమానిక దాడుల్లో 112 మంది తాలిబన్ టెర్రరిస్టులు మరణించారని..వీరిలో 30 మంది అల్-ఖైదా పాక్ ఉగ్రవాదులు ఉన్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆఫ్ఘన్ దళాల దాడుల్లో 30 మంది పాకిస్తానీ అల్-ఖైదా ఉగ్రవాదుల మృతి... ఇంకా..
Taliban Terrorists Killed By Afghan Forces
Follow us on

ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా తాలిబాన్లపై విరుచుకపడ్డాయి. తాము జరిపిన వైమానిక దాడుల్లో 112 మంది తాలిబన్ టెర్రరిస్టులు మరణించారని..వీరిలో 30 మంది అల్-ఖైదా పాక్ ఉగ్రవాదులు ఉన్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 31 మంది గాయపడినట్టు పేర్కొంది. హెల్మండ్ ప్రావెన్షియల్ సెంటర్ లోని లష్కర్ ఘర్ సిటీ శివార్లలో ఈ దాడులు జరిగినట్టు తెలియజేసింది. 2019 లో అల్-ఖైదా నేత ఆసి ఉమర్ మరణించిన తరువాత ఒసామా మహమూద్ ఆధ్వర్యాన ఈ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తోంది.ఈ గ్రూప్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా మయన్మార్ సభ్యులు కూడా ఉన్నారు. మరో వైపు తాలిబన్లు కూడా ఆఫ్గనిస్తాన్ లో తమ పోరును ఉధృతం చేస్తున్నారు. ఈ నెల మొదటి 5 రోజుల్లో తాలిబన్ల దాడుల్లో 115 మంది ఆఫ్ఘన్ సైనికులు, 58 మంది పౌరులు మరణించారు. కాంగ్ జిల్లాలో 30 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారు. తమకు లొంగిపోతున్నవారిని కూడా తాలిబన్లు వదిలిపెట్టడం లేదు. ఈ జిల్లాలో ఓ పోలీసు అధికారి సహా ఆరుగురు ఆఫ్ఘన్ సైనికులు లొంగిపోయినప్పటికీ వారిని కాల్చి చంపారు.

హెల్మండ్ ప్రావిన్స్ లో 20 మంది పౌరులు మరణించగా సుమారు 190 మంది గాయపడ్డారు. ఈ నెల 5 న జోజియన్ ప్రావిన్స్ లో తాలిబాన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య కొన్ని గంటల పాటు పోరు సాగింది. ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్ లో సుమారు 400 జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రొవిన్షియల్ రాజధానులను సైతం వశపరచేందుకు యత్నిస్తున్నారు. ఈ నెల 6 న కాబూల్ లోని మసీదు వద్ద ప్రభుత్వ మీడియా హెడ్ ను వారు కాల్చి చంపారు. మరిన్ని ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. ఆఫ్ఘన్ లోని పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి న్యూయార్క్ లో సమావేశమై చర్చిస్తోంది. ఈ నెల 11 న రష్యా.. ఖతార్ లో మూడు దేశాలతో సమావేశమై.. ఈ సమస్యకు ఓ రాజీ సూత్రాన్ని కనుగొనేందుకు ప్రతిపాదించింది. అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఒలంపిక్స్ లో మెరిసిన భారతీయ తేజాలు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏం చేశారంటే ..?

Dog Shopping: ఇది మామూలు శునకం కాదోచ్.. ఆర్డరిస్తే చాలు.. వెంటనే తెచ్చేస్తుంది..