TANA 2023: ఆరంభం అదిరిపోవాల్సిందే.. న్యూజెర్సీ వేదికగా ధీం-తానా పోటీలు..

|

Jun 10, 2023 | 6:32 PM

23rd TANA Conference: ఉత్తర అమెరికాలోని అతిపెద్ద ఇండో-అమెరికన్ సంస్థ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ సమావేశాలు జూలై 7,8,9 వ తేదీల్లో జరగనున్నాయి.

TANA 2023: ఆరంభం అదిరిపోవాల్సిందే.. న్యూజెర్సీ వేదికగా ధీం-తానా పోటీలు..
TANA-2023
Follow us on

23rd TANA Conference: ఉత్తర అమెరికాలోని అతిపెద్ద ఇండో-అమెరికన్ సంస్థ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ సమావేశాలు జూలై 7,8,9 వ తేదీల్లో జరగనున్నాయి. 23వ తానా కాన్ఫరెన్స్‌ను ఫిలడెల్ఫియాలోని పెల్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తానా మహాసభల్లో పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి తానా అవార్డ్స్ లను కూడా అందజేయనున్నారు. తానా సభల సందర్భంగా టీవీ9 సహకారంతో ధీం-తానా కార్యక్రమాన్ని అమెరికాలోని మూడు నగరాల్లో నిర్వహించనున్నారు. జూన్‌ 11న న్యూజెర్సీ వేదికగా ధీం-తానా పోటీలు జరగనున్నాయి. ఆనందమందిర్‌ 269 సెడర్ గ్రోవ్‌ లెన్ సోమర్‌సెట్‌లో ధీంతానా వేడుక జరగనుంది. ధీంతానా వేడుకల్లో టీవీ9 తెలుగు కూడా భాగస్వామ్యంగా ఉంది.

ధీం-తానా కార్యక్రమంలో సోలో సింగింగ్‌, గ్రూప్‌ డాన్స్‌, మిస్‌ టీన్‌ తానా, మిస్‌ తానా, మిసెస్‌ తానా, తానా చిలుకా గోరింక పోటీలను నిర్వహించనున్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రోగ్రాం కోఆర్టినేటర్లు ప్రకటన విడుదల చేశారు. ఈ వారాంతంలో వినోదం, శక్తివంతమైన ప్రదర్శనల కోసం సిద్ధంగా ఉండాలని.. 3 నగరాల్లో ధిమ్‌తానా బ్యాక్ టు బ్యాక్.. లాస్ ఏంజిల్స్. సెయింట్ లూయిస్, న్యూజెర్సీ టీవీ9 సహకారంతో ఈ వేడుక నిర్వహించనున్నట్లు ఈవెంట్ కోఆర్టినేటర్లు తెలిపారు.

ఈ వేడుకలో ప్రముఖ సినీ హీరోలు, గాయకులు, ప్రముఖులు, తదితరులు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..