AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. మారథాన్‌ నిర్వహిస్తుండగా వడగండ్ల వర్షం.. 21 మంది మృతి.. పలువురికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం

ప్రస్తుతం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాను కారణంగా భారత్‌లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లగా, ఇతర దేశాలలో కూడా వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా చైనాలో విషాదం..

విషాదం.. మారథాన్‌ నిర్వహిస్తుండగా వడగండ్ల వర్షం.. 21 మంది మృతి.. పలువురికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం
Subhash Goud
|

Updated on: May 23, 2021 | 4:09 PM

Share

ప్రస్తుతం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాను కారణంగా భారత్‌లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లగా, ఇతర దేశాలలో కూడా వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా చైనాలో విషాదం చోటు చేసుకుంది. మారథాన్‌ జరుగుతుండగా, వడగండ్ల వర్షం కురియడంతో 21 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వత ప్రాంతంలో చోటుచేసుకుంది. వాతావరణం పొడిగా ఉండటంతో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ ప్రారంభించారు. మారథాన్ మొదలైన సమయంలో వాతావరణం పొడిగా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం చల్లబడి, ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మారథాన్ లో పాల్గొన్న అథ్లెట్లు పక్కనే ఉన్న కొండల్లోకి వెళ్లిపోయారు. యెల్లో రివర్‌ స్టోన్‌ఫారెస్ట్‌ వెంట పరుగులు తీస్తున్న వాళ్లలో చాలామంది హైపోథెర్మియాకు గురయ్యారు.

ఇందులో 21 మంది వరకు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 172 మంది ఈ రేస్ లో పాల్గొనగా 100 మందికిపైగా అథ్లెట్ల ఆచూకీ లభించలేదు. దీంతో 1200 రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశాయి. ఆదివారం ఉదయానికి 151 మందిని కనుగొన్నారు.. వీరిలో 21 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరి కొందరు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే 21 మంది చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు.

మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు షార్ట్స్‌ ,టీషర్ట్స్‌ ధరించడం కూడా వాళ్ల మృతికి ఒక కారణమైందని అధికారులు చెబుతున్నారు. ఇక గాయపడిన వారు మీడియాతో మాట్లాడాడు.. హఠాత్తుగా చీకటి అలుముకుందని, తన నాలుకతో పాటు వేలు గడ్డకట్టాయని తెలిపాడు. వెంటనే సమీపంలోని చెట్టు వద్దకు వెళ్లి దాక్కున్నామని తెలిపారు. కాగా ఈ ఘటనలో మరికొంత మంది మరణించే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Cyclone Yaas : తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన యాస్.. 26వ తేదీన అతి తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం

Bommanahalli : భర్త చనిపోయిన కొంతసేపటికే భార్య ఆత్మహత్య.. గంటల వ్యవధిలోనే విగతజీవులుగా యువ జంట