బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. కాలువలో బస్సు పడి 17 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు..

బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 17 మంది మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం.. కాలువలో బస్సు పడి 17 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు..
Bus Accident

Updated on: Mar 19, 2023 | 1:47 PM

బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో 17 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పద్మా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నుంచి ఢాకా వరకు ఓ ప్యాసింజర్ బస్సు వెళుతోంది. ఉదయం 7.30 గంటలకు మదరిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి సహాయక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని షిబ్‌చార్ హైవే పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓసి అబూ నయీమ్ ఎండి మోఫాజెల్ హక్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల అలాగే బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు బస్సు వెళ్తుండగా దాని చక్రం పగిలిపోయిందని..దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కాలువలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమరు 30 మంది తీవ్ర గాయాలుపాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మృతులు వివరాలని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం