AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈస్టర్ ప్రార్థనల్లో విషాదం.. చ‌ర్చి గోడ కూలి 13 మంది మృతి

కేప్ టౌన్: దక్షిణాఫ్రికాలో డ్లంగుబో ప్రాంతంలో శుక్రవారం ఉదయం చర్చి గోడ కూలి 13 మంది మృతి చెందారు. పెంటకోస్ట్ చర్చిలో ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గురువారం భారీ వర్షాలు కురవడంతో గోడ దెబ్బతిందని స్థానికులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఈ ఘటనపై సంతాపం […]

ఈస్టర్ ప్రార్థనల్లో విషాదం.. చ‌ర్చి గోడ కూలి 13 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 7:47 PM

Share

కేప్ టౌన్: దక్షిణాఫ్రికాలో డ్లంగుబో ప్రాంతంలో శుక్రవారం ఉదయం చర్చి గోడ కూలి 13 మంది మృతి చెందారు. పెంటకోస్ట్ చర్చిలో ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గురువారం భారీ వర్షాలు కురవడంతో గోడ దెబ్బతిందని స్థానికులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఈ ఘటనపై సంతాపం తెలిపారు.