Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ క్షణమైనా యుగాంతం..సంపన్నులకేనా బంకర్లు వీడియో

ఏ క్షణమైనా యుగాంతం..సంపన్నులకేనా బంకర్లు వీడియో

Samatha J

|

Updated on: May 12, 2025 | 3:51 PM

ప్రళయం ముంచుకొస్తుందా? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉందా? డూమ్స్ డే క్లాక్ ఏం చెబుతుంది? ప్రపంచ వినాశనానికి అతి దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1947లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడాది అమెరికా, సోవియట్ యూనియన్ లో హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో యుగాంతం రావచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. అసలు డూమ్స్ డే క్లాక్ ఎలా పనిచేస్తుంది? ప్రపంచ వినాశనం నుంచి బయటపడడానికి మరో మార్గం లేదా? అత్యంత సంపన్నులు, ఉన్నత అధికారుల కోసం అమెరికా భూగర్భ నగరాన్ని నిర్మించిందా? ఇందుకోసం ఏకంగా 21 లక్షల కోట్ల డాలర్లు ప్రజల సొమ్మును ఖర్చుచేసిందా? ఈ స్టోరీలో చూద్దాం.

2020లో కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలలో బయో ఉత్పాతాన్ని రగిల్చింది. ప్రపంచ వినాశనానికి అది హెచ్చరిక అని త్వరలో ప్రపంచం అంతం కాబోతుందని ఎంతోమంది అన్నారు. కొందరు డూమ్స్ డే ప్రవచనాలు చెప్పారు. మాయాన్ క్యాలెండర్ ప్రకారం 2012లోను యుగాంతం ఊహాగానాలు రాగా అది అబద్ధమని తెలింది. జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది తేల్చి చెప్పడంతో ప్రజలంతా భయపడిపోయారు. కానీ అది జరగలేదు. ప్రళయం వస్తుంది. ప్రపంచం అంతరించుతుంది. వినాశనం తప్పదనే మాటలు తరచుగా వింటూనే ఉన్నాం. వాతావరణ మార్పులు, ప్రపంచ యుద్ధాలు, అణుబాంబు పేలుళ్లు వంటి భూగోళానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదాలుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. అంతేకాదు ఆస్టరాయిడ్లు, గ్రహశకాల నుంచి ఎంతోకొంత ప్రమాదం ఉందని అంటున్నారు. పరిశోధకులు, సిద్ధాంతులు, కాలజ్ఞానులు ఇలా ఎవరికి వారు యుగాంతంపై ఎప్పటికప్పుడు కొత్త అభిప్రాయాలు, అంచనాలు వేస్తున్నారు. కాగా ప్రపంచం అంతమయ్యే రోజు గురించి ప్రమాదాల తీవ్రతను హెచ్చరిస్తూ డూమ్స్ డే క్లాక్ ఒకటుంది. దాని ప్రకారం 100 సెకన్లలో యుగాంతం రాబోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక్కడ సెకన్ అంటే గడియారంలో సెకన్ కాదు. దీనికో లెక్క ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో

ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో

మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో