భూమ్మీద నరకం.. ఆ జైలు.. అక్రమ వలసదారులను అక్కడికే

భూమ్మీద నరకం.. ఆ జైలు.. అక్రమ వలసదారులను అక్కడికే

Phani CH

|

Updated on: Feb 03, 2025 | 8:54 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాకు వచ్చే అక్రమ వలసదారుల్ని గ్రహాంతరవాసులతో పోలుస్తున్నారు. వాళ్లను తిరిగి స్వదేశాలకు పంపే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటిదాకా.. వారం వ్యవధిలో 7,300 మందిని వెనక్కి పంపించేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించే ప్రసక్తి లేదని ట్రంప్‌ మరోసారి పునరుద్ఘాటించారు.

అక్రమ వలసదారులను ఫెడరల్‌ అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేందుకు అవసరమైన ‘లేకెన్‌ రిలే’ చట్టం అక్కడి చట్టసభల ఆమోదం పొందింది. ఆ ఫైల్‌పై ట్రంప్‌ తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమినల్స్‌ను విడిచిపెట్టమనీ దేశం నుంచి పంపించేస్తామనీ తెలిపారు ట్రంప్‌. అయితే కొందరు అత్యంత క్రూరులు ఉంటారనీ వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్లీ వచ్చే అవకాశం ఉంది అందుకే వాళ్లను నరకంలాంటి గ్వాంటనమో జైలుకు తరలిస్తామనీ అన్నారు. సుమారు 30 వేల మంది కోసం అక్కడ బెడ్లు సిద్ధం చేయించే ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తా అని అన్నారాయన. క్యూబాలోని గ్వాంటనామో బేలో ఉంది ఈ అమెరికా మిలిటరీ ప్రిజన్‌. భూమ్మీది నరకంగా ఈ జైలును అభివర్ణిస్తుంటారు. ఉగ్రవాదుల బందీఖానాగా దీనికి పేరుంది. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత 2012లో అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ఈ జైలును ప్రారంభించారు. 9/11 దాడుల్లో పాల్గొన్నవాళ్లను అమెరికా ఇక్కడ నిర్భంధించింది. ఇక్కడి ఖైదీలను మానసికంగా, శారీకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. జనవరి 2025 నాటికి.. ఈ జైల్లో 48 దేశాలకు చెందిన 780 మందిని బందీలుగా ఉంచారు. అయితే.. 756 మందిని వెనక్కి పంపించేశారు. కస్టడీలో 9 మంది చనిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే అక్కడ ఉన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శాంతించిన బంగారం.. గోల్డ్‌ ధర ఎంతో తెలుసా ??

Jio: రెండు పాపులర్‌ రీఛార్జ్‌ ప్లాన్లను ఎత్తేసిన జియో

ఆలయాల్లో QR కోడ్ సర్వే.. స్కాన్‌ చేస్తే సొల్యూషన్..

ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు

టేబుల్ పై రూ.70 కోట్లు.. ఎంత లెక్కపెడితే అంత మీదే అని ఆఫర్