రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు..104 మంది..వీడియో
హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర తలుపును తెరవగా ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రయాణికులను సురక్షితంగా దించేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో
Published on: Feb 03, 2025 08:43 PM
వైరల్ వీడియోలు

పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్.. అలా ఎలా పెట్టావ్ పాప

దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్ డ్యూయెట్..

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో
