Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంతించిన బంగారం.. గోల్డ్‌ ధర ఎంతో తెలుసా ??

శాంతించిన బంగారం.. గోల్డ్‌ ధర ఎంతో తెలుసా ??

Phani CH

|

Updated on: Feb 03, 2025 | 8:54 PM

భారత్‌లో బంగారం వినియోగదారులు ఎక్కువ. అందుకే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం భారత్‌లోకి వస్తుంది. ఇటీవల అది మరింత పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. గత ఏడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయి.

కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఎన్నికలు, ట్రంప్ విజయం వంటి చాలా కారణాలు ఇప్పుడు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. సరికొత్త రికార్డ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములు రూ. 77,450 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84 వేల 490 వద్దే కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 77, 440లు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,480గా ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు దిగవస్తాయని అంతా అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోడవంతో బంగారం ధరల్లో ఏ మార్పు కనిపించలేదని చెప్పవచ్చు. బంగారంతో పాటుగా వెండి రేట్లు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు వరుసగా మూడో రోజూ స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 1,07,000 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అగిరిపల్లిలో వింత జంతువులు.. దగ్గరికెళ్లి చూస్తే షాక్

Jio: రెండు పాపులర్‌ రీఛార్జ్‌ ప్లాన్లను ఎత్తేసిన జియో

ఆలయాల్లో QR కోడ్ సర్వే.. స్కాన్‌ చేస్తే సొల్యూషన్..

ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు

టేబుల్ పై రూ.70 కోట్లు.. ఎంత లెక్కపెడితే అంత మీదే అని ఆఫర్

Published on: Feb 03, 2025 08:50 PM