అగిరిపల్లిలో వింత జంతువులు.. దగ్గరికెళ్లి చూస్తే షాక్
ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలో పులి పిల్లలు కలకలం రేపాయి. పొలం పనుల కోసం వెళ్లిన రైతులు, రైతు కూలీలకు ఈ పులి పిల్లలు కనిపించాయి. వాటిని చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిల్లల కోసం తల్లి పులి వస్తుందేమోనని భయపడ్డారు. ఆ పులి కూనలను పట్టుకుని పరిశీలించారు. అవి పులి పిల్లలుగానే భావించారు.
పొలాల్లో పులి సంచరిస్తోందని, పొలంలో పులి.. పిల్లలను పెట్టిందని ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని ప్రచారం చేశారు. సెల్ ఫోన్ లో పులి పిల్లల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీటిని చూసిన స్థానికులు.. ఆ పులి తన పిల్లల కోసం ఎక్కడ వస్తుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు. పులి పిల్లల గురించి సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వాటిని పరిశీలించి, ఇవి పులి పిల్లలు కాదు అడవి పిల్లి పిల్లలు అని నిర్దారించారు. కాగా తల్లి పిల్లి వచ్చి వాటిని తీసుకెళ్లేవరకూ వాటిని ఎవరూ కదల్చ వద్దని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హరి గోపాల్ రైతులకు సూచించారు. పిల్లల కోసం తల్లి పిల్లి తప్పక వస్తుందని, ఆ సమయానికి పిల్లలు అక్కడ లేకపోతే మరలా వాటిని ముట్టుకోదని వివరించారు. పిల్లి స్వభావం ప్రకారం తన పిల్లలను ఒక చోటు నుండి మరొక చోటికి మారుస్తుందని తెలిపారు. పిల్లి మార్చిన స్థలంలో కాకుండా.. మరొక చోట ఆ పిల్లలు ఉంటే తనవి కాదని వదిలేస్తుందని అన్నారు హరి గోపాల్. కనుక అడవి పిల్లి పిల్లలను ఎక్కడ కనిపించాయో అక్కడే ఉంచినట్టు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jio: రెండు పాపులర్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసిన జియో
ఆలయాల్లో QR కోడ్ సర్వే.. స్కాన్ చేస్తే సొల్యూషన్..
ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

