ఆలయాల్లో QR కోడ్ సర్వే.. స్కాన్ చేస్తే సొల్యూషన్..
ఇప్పుడంతా డిజిటల్ మయమే. చిల్లర కొట్టులో చెల్లింపుల నుంచి మల్టీప్లెక్స్‌లలోని షాప్‌ల వరకూ అన్ని చోట్లా QR కోడ్‌ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. సుమారు ఐదేళ్లుగా ఈ డిజిటలైజేషన్‌కి అంతా అలవాటుపడిపోయారు. కొన్నిచోట్ల QR కోడ్‌ల ద్వారా సమాచారం అందించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
ఓ శిల్పం గురించో, ఆలయ చరిత్ర గురించో తెలుసుకోవాలంటే ఆ క్యూర్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు..క్షణాల్లో ఆ వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. అయితే..ఈ డిజిటలైజేషన్‌ని కేవలం సమాచారం తెలుసుకునేందుకే కాకుండా..అభివృద్ధి కోసమూ వాడాలని చూస్తున్నాయి ప్రభుత్వాలు. అందులో ఏపీ ఓ అడుగు ముందే ఉంది. ముఖ్యంగా ఆలయాల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటీవల తిరుమలలో వైకుంఠ ఏకాదశి సమయంలో తొక్కిసలాట జరిగింది. దీనిపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే..ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం టెక్నాలజీ సహకారం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఇకపై QR కోడ్ సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి..? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అనే విషయాలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. ఈ బాధ్యతలను దేవాదాయ శాఖకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 7 ప్రధాన దేవాలయాల్లో QR కోడ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ, శ్రీశైలం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
