డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్ వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. అలాగే పలు కేసుల్లో దోషులను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సిల్క్‌రోడ్ డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడు రాస్ విలియం ఉల్‌బ్రిచ్ట్ కు కూడా క్షమాభిక్షను ప్రసాదించారు. ఇంటర్నెట్ వేదికగా విస్తృతస్థాయిలో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారన్న అభియోగాలపై అమెరికా న్యాయస్థానం రాస్ విలియంకు 2015లో జీవితఖైదు విధించింది.
సిల్క్‌రోడ్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి.. మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కంప్యూటర్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని విలియంపై అభియోగాలు నమోదుకాగా.. 2013లో ఎఫ్‌బీఐ ఆ వెబ్‌సైట్‌ను మూసివేసింది. ‘‘అతడొక డ్రగ్ డీలర్. ప్రజల వ్యసనాల నుంచి లబ్ధిపొందాడు. ఆరుగురు ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు’’ అని జీవితఖైదు శిక్ష వేసిన సందర్భంగా మాన్‌హటన్ అటార్నీ పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే రాస్ విలియంకు క్షమాభిక్ష పెడతానని గత మే నెలలో ట్రంప్ హామీ ఇచ్చారు. అతడు ఇప్పటికే 11 సంవత్సరాల శిక్ష అనుభవించాడని వ్యాఖ్యానించారు. అతడికి విధించిన శిక్ష హాస్యాస్పదమంటూ తాజాగా అభివర్ణించారు. అంతేకాదు, చర్చిలు, పాఠశాలల్లో అక్రమ వలసదారులు ఉంటే అరెస్టు చేయకూడదనే గత నిబంధనను తాజాగా ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. దాంతో ఇకపై పాఠశాలలు, చర్చిలలోనూ అక్రమ వలసదారుల అరెస్టుకు వీలు కలుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి
ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
