లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కూరగాయల లారీ బోల్తా పడింది. దీంతో పదిమంది రైతులు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదిహేను మందికి తీవ్రగాయాలయ్యాయి. సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపు తప్పింది. మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో లారీలో కూర్చున్న రైతులు పదిమంది చనిపోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. వాహనదారుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలో ప్రయాణం ప్రమాదకరమని.. సాధ్యమైనంతవరకు ప్రజారవాణా సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
