Asteroid: అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..

Asteroid: అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..

Anil kumar poka

|

Updated on: Jul 04, 2024 | 5:02 PM

తాజాగా రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందులో ఒకటి శని, ఆదివారాల్లో భూమి సమీపానికి వచ్చింది. దాని పేరు 2024 ఎంకే. వెడల్పు 200 మీటర్లు. ఆదివారం అంతర్జాతీయ గ్రహశకల దినం. సరిగ్గా అదే రోజున ఈ పరిణామం జరగడం విశేషం. మనకు అత్యంత చేరువగా వచ్చినప్పుడు ఈ గ్రహశకలం.. 3లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.

తాజాగా రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందులో ఒకటి శని, ఆదివారాల్లో భూమి సమీపానికి వచ్చింది. దాని పేరు 2024 ఎంకే. వెడల్పు 200 మీటర్లు. ఆదివారం అంతర్జాతీయ గ్రహశకల దినం. సరిగ్గా అదే రోజున ఈ పరిణామం జరగడం విశేషం. మనకు అత్యంత చేరువగా వచ్చినప్పుడు ఈ గ్రహశకలం.. 3లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఇది 77 శాతంతో సమానం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ పరిమాణం చోటుచేసుకుంది. ఈ గ్రహశకలాన్ని ఒకమోస్తరు స్థాయి బైనాక్యులర్‌తో ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఔత్సాహికులు వీక్షించారు. ఈ అంతరిక్ష శిల పెద్దది కావడం, చాలా దగ్గరగా రావడం వంటి కారణాల వల్ల అది ఒకింత ప్రకాశవంతంగా కనిపించింది. దీన్ని తొలిసారిగా ఈ ఏడాది జూన్‌ 16న గుర్తించారు.

రెండో గ్రహశకలం పేరు 2011 యూఎల్‌21. దీని వెడల్పు 2.3 కిలోమీటర్లు. భూమికి సమీపంలోని 99 శాతం ఖగోళవస్తువుల కన్నా ఇది పెద్దది. కొద్దిరోజుల కిందట అది పుడమికి చేరువగా వచ్చి వెళ్లింది. అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు అది మనకు 66 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. 1900 తర్వాత పుడమి సమీపానికి వచ్చి వెళ్లిన పది అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది కూడా ఒకటి. భూమికి చుట్టుపక్కల 20 మీటర్ల కన్నా పెద్దగా ఉన్న శిలలు 50 లక్షల వరకూ ఉన్నాయి. అవి పుడమి మీదకు దూసుకొస్తే నష్టం తప్పదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.