Signature collection in online: ఉరిశిక్ష పడ్డ వ్యక్తి కోసం ఆన్‌లైన్ వేదికగా సంతకాల సేకరణ..! ఇంతకీ అతను చేసిన తప్పేంటి.. (వీడియో)

Signature collection in online: ఉరిశిక్ష పడ్డ వ్యక్తి కోసం ఆన్‌లైన్ వేదికగా సంతకాల సేకరణ..! ఇంతకీ అతను చేసిన తప్పేంటి.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 14, 2021 | 9:47 AM

ఉరిశిక్ష పడిన వ్యక్తి కోసం మానవ హక్కుల సంఘాలు నడుంకట్టాయి. క్షమాభిక్ష పెట్టాలంటూ ఉద్యమిస్తున్నాయి. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ వేదికగా మద్దతు కూడగడుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో...


ఉరిశిక్ష పడిన వ్యక్తి కోసం మానవ హక్కుల సంఘాలు నడుంకట్టాయి. క్షమాభిక్ష పెట్టాలంటూ ఉద్యమిస్తున్నాయి. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ వేదికగా మద్దతు కూడగడుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఓ భారత సంతతి వ్యక్తి కోసం సింగపూర్​లో ఆన్‌లైన్ వేదికగా భారీ ఉద్యమం నడుస్తోంది. అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్​లైన్​వేదికగా మానవ హక్కుల సంఘాలు భారీ ఎత్తున సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 40 వేల సంతకాలను కూడగట్టాయి.

మలేషియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్‌ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై 2010లో సింగపూర్ కోర్టు దోషిగా తేలింది. దీంతో నాగేంద్రన్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేయనున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆందోళన చెందిన మానవ హక్కుల సంఘాలు.. నాగేంద్రన్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ సింగపూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మానసిక వికలాంగుడైన నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నాయి. నాగేంద్రన్‌ హైపర్ యాక్టివిటీ డిజార్డర్​తో బాధపడుతున్నట్లు సమాచారం.

కాగా .. నాగేంద్రన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే అతడు ఈ తప్పు చేసినట్లు హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. అటు క్షమాభిక్ష కోసం నాగేంద్రన్ అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ కూడా తిరస్కరణకు గురైంది.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…