Woman Savings: డబ్బు ఖర్చు చేయడం భయమట.. అందుకే 90 శాతం జీతం పొదుపు చేస్తుంది.. వైరల్ వీడియో.

Woman Savings: డబ్బు ఖర్చు చేయడం భయమట.. అందుకే 90 శాతం జీతం పొదుపు చేస్తుంది.. వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 14, 2021 | 9:39 AM

జీతం రాగానే నెలవారీ ఖర్చులకు పోను వీకెండ్‌ సినిమాలు బయట ఫుడ్‌కు ఖర్చు పెట్టేవారే ఎక్కువ. పొదుపు చేయాలన్న ఆలోచనే అసలు రానివ్వరు చాలా మంది. అయితే డబ్బు ఖర్చుపెట్టడం అంటే భయపడుతోంది ఓ యువతి.


జీతం రాగానే నెలవారీ ఖర్చులకు పోను వీకెండ్‌ సినిమాలు బయట ఫుడ్‌కు ఖర్చు పెట్టేవారే ఎక్కువ. పొదుపు చేయాలన్న ఆలోచనే అసలు రానివ్వరు చాలా మంది. అయితే డబ్బు ఖర్చుపెట్టడం అంటే భయపడుతోంది ఓ యువతి. ఎన్నో సౌకర్యాలు ఎదురుగా కన్పిస్తున్నా అవేవీ కాదనుకుని ఏకంగా 90 శాతం దాచేస్తోంది. అయితే ఆశ్చర్యపోయేలా చైనాకు చెందిన షెనాయ్‌ పొదుపు చేసిన సొమ్ముతో తొమ్మిదేళ్లలో రెండు ఇళ్లు కొనేసింది.

తాను చేస్తోన్న పొదుపు గురించి షెనాయ్‌.. చైనా కంపెనీ టెన్సెంట్‌కు వివరించింది . ‘నేనెప్పుడు బయట ఆహారం తీసుకోలేదు. స్నేహితులతో బయటకు వెళ్లడం, విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెట్టడంలాంటివి చేయనే చేయలేదు. వాడేసి, తక్కువ ధరలో దొరికే ఫర్నీచర్ మాత్రమే కొనేదాన్ని. దుస్తుల కోసం నేను వెచ్చించే డబ్బు చాలా తక్కువ. నా స్నేహితుల నుంచి సెకండ్ హ్యాండ్ దుస్తులు తీసుకునేదాన్ని. ప్రజా రవాణా తప్ప.. ప్రైవేటు వాహనంలో అస్సలు వెళ్ళేదాన్ని కాదు. కొంతమంది తమకు ఇష్టమైన వాటి మీద డబ్బు ఖర్చుపెట్టాక మంచి అనుభూతి పొందుతారు. నాకు డబ్బు ఖర్చుపెట్టడం అంటే భయం, అని వెల్లడించింది. ఆమె భర్త కూడా ఇప్పటికే పాత మోడల్ ఫోన్‌ వాడుతున్నారట. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమె చైనాలోని నాన్జింగ్ నగరంలో రెండు ఇళ్లు కొనుగోలు చేసింది. షెనాయి డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది. ప్రకటన రంగంలో పనిచేసిన అనుభవం ఉంది. అదే తాను తక్కువ ఖర్చు పెట్టేలా చేసిందని చెప్పారు. అలాగే ఈమె అతి పొదుపు చిట్కాలను వినే ఆన్‌లైన్ గ్రూప్‌ కూడా ఉంది. దానిలో నాలుగు లక్షల మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఈమె జీవనశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘మీరు చనిపోతే డబ్బు వెంట తీసుకెళ్లలేరు’, ‘ఈ అతి పొదుపు గురించి మీడియా ప్రచారం చేయకూడదు. చాలా పొదుపుగానే ఉన్నా.. భారీస్థాయిలో ఉన్న ఇళ్ల ధరల కారణంగా చాలామంది వాటిని కొనుగోలు చేయలేరు’ అంటూ విమర్శించారు. ఆమె తెలివైందని, ఇన్ని సౌకర్యాలు ఎదురుగా కన్పిస్తున్నా.. ఆమెలా జీవించడం చాలా కష్టమని మరికొందరు ప్రశంసించారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…