Plane: ఎగురుతున్న విమానంలో కుదుపులు..ఒకరు మృతి.! అసలేంజరిగిదంటే..?

Plane: ఎగురుతున్న విమానంలో కుదుపులు..ఒకరు మృతి.! అసలేంజరిగిదంటే..?

Anil kumar poka

|

Updated on: Mar 15, 2023 | 8:26 PM

గాల్లో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా కుదుపులకు లోనవడంతో ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. ఇదేంటి గాల్లో ఎగిరే విమానం కూడా కదుపులకు లోనవుతుందా అనుకుంటున్నారా ?

గాల్లో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా కుదుపులకు లోనవడంతో ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. ఇదేంటి గాల్లో ఎగిరే విమానం కూడా కదుపులకు లోనవుతుందా అనుకుంటున్నారా ? అవును, వీచే గాలిలో సడన్‌గా మార్పులు కలిగినప్పుడు ఎగురుతున్న విమానం కుదుపులకు గురవుతుంది. ఇలా గాల్లో ఆకస్మికంగా ఏర్పడే మార్పులను టర్బులెన్స్‌ అంటారు. మార్చి 3న అమెరికాలోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానం గగనతలంలో ఎగురుతుండగా కుదుపులకు గురయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గగనతలంలో టర్బులెన్స్ కారణంగా విమానం కుదుపులకు లోనైంది, విమానం కుదుపులకు లోనైనప్పుడు కొన్ని సమయాల్లో ప్రయాణికులు గాయాలపాలవుతారు. మిస్సోరీలోని కానేక్సాన్ సంస్థకు చెందిన తేలికపాటి విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా ప్రమాదసమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. కీన్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం 20 నిమిషాలకే బ్రాడ్లే విమానాశ్రయంలో అత్యవసరంగా లాండైంది. ప్యాసింజర్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. ప్రయాణికుడు ఎలా మరణించాడో ఇప్పుడే చెప్పలేమని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌టీఎస్‌బీ..విమానంలో బ్లాక్ బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. ఘటనపై విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 08:26 PM