Dairy Milk: లండన్ బాత్రూంలో డైరీ మిల్క్.. ఇది 90 ఏళ్ల క్రితం డైరీ మిల్క్.. వీడియో వైరల్.

Dairy Milk: లండన్ బాత్రూంలో డైరీ మిల్క్.. ఇది 90 ఏళ్ల క్రితం డైరీ మిల్క్.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Mar 15, 2023 | 8:31 PM

అప్పట్లో చాక్లెట్ బార్ ధ‌ర కేవ‌లం 6 పెన్స్ మాత్రమే. ర్యాప‌ర్‌పై గోల్డ్ క‌ల‌ర్‌లో క్యాడ్‌బ‌రీస్ డైరీ మిల్క్ చాక్లెట్ నియాపోలిట‌న్ అని రాసి ఉంది. ఎమ్మా పూర్వీకులు ఆ ఇంటిని 1932లో నిర్మించారట.

లండన్‌లో ఓ మ‌హిళ త‌న ఇంటికి మ‌ర‌మ్మ‌త్తులు చేస్తుండ‌గా సుమారు 90 ఏళ్ల క్రితం నాటి డైరీ మిల్క్ ర్యాపర్‌ దొరికింది. దాన్ని చూసి ఆమె షాకయ్యారు. ఎమ్మా యంగ్ త‌న బాత్‌రూం రినోవేష‌న్ చేస్తుండ‌గా ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉన్న డైరీ మిల్క్ ర్యాప‌ర్‌ను గుర్తించారు. కంపెనీ ప్ర‌తినిధుల‌ను ఎమ్మా సంప్ర‌దించ‌గా ఇది 1930-34 నాటిద‌ని వారు తెలిపారు.అప్పట్లో చాక్లెట్ బార్ ధ‌ర కేవ‌లం 6 పెన్స్ మాత్రమే. ర్యాప‌ర్‌పై గోల్డ్ క‌ల‌ర్‌లో క్యాడ్‌బ‌రీస్ డైరీ మిల్క్ చాక్లెట్ నియాపోలిట‌న్ అని రాసి ఉంది. ఎమ్మా పూర్వీకులు ఆ ఇంటిని 1932లో నిర్మించారట.వందేళ్లయినా చాక్లెట్ బార్ అదే కండిష‌న్‌లో ఉండటం చూసి ఆశ్చర్యపోయినట్లు ఎమ్మా చెప్పుకొచ్చారు. చాక్లెట్ ఓ వైపు ఎలుక కొరికిన‌ట్టుగా ఉంద‌ని మిగిలిన భాగం షెల్ఫ్‌లో పెట్టిన‌ట్టుగా ఉంద‌ని అన్నారు. ఈ చాక్లెట్‌ని బోర్న్‌విల్లే కంపెనీ ఇంగ్లండ్‌లో త‌యారుచేసినట్లు రాసి ఉంది.ఈ క్యాడ్‌బ‌రీ రాపర్‌ చ‌రిత్ర‌ను తిరిగి జ్ఞ‌ప్తికి తెచ్చిందని క్యాడ్‌బ‌రీ ప్ర‌తినిధి తెలిపారు. బ్రిటిష్ సంస్కృతిలో క్యాడ్‌బ‌రీకి 200 ఏళ్ల వార‌స‌త్వం ఉంద‌ని ప్ర‌జ‌ల జీవితాల్లో త‌మ చాక్లెట్ చెర‌గ‌ని ముద్ర వేసింద‌ని 1930ల నాటి డైరీ మిల్క్ నియోపాలిట‌న్‌ అప్పట్లో చాలా పాపులర్ అని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 08:31 PM