Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా

ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా

Phani CH

|

Updated on: Jul 29, 2024 | 9:31 PM

తమ డెమోక్రటిక్‌ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలిగానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత బుధవారం ఆయన తొలిసారి ప్రసంగించారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్‌ సమర్థించుకున్నారు.

తమ డెమోక్రటిక్‌ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలిగానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత బుధవారం ఆయన తొలిసారి ప్రసంగించారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్‌ సమర్థించుకున్నారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని.. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సమర్థురాలంటూ ఓవల్‌ ఆఫీసు నుంచి చేసిన ప్రసంగంలో ఆమెను బైడెన్‌ ప్రశంసించారు. ఆమే అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ??

నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌

ప్రపంచంలో భయంకర ఆర్థిక అసమానతలు.. ఆక్స్‌ఫామ్‌ నివేదికలో షాకింగ్‌ నిజాలు

ఇంట్లో చొరబడిన చిరుత !! తీవ్ర భయాందోళనలో స్థానికులు

పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు