ఇంట్లో చొరబడిన చిరుత !! తీవ్ర భయాందోళనలో స్థానికులు
నిన్న మొన్నటి వరకూ పుణ్యక్షేత్రాలోన్ని ఘాట్ రోడ్లలో, నడక మార్గాల్లో సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతలు ఇప్పుడు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత అక్కడ ఉన్న రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో ఆ ఇంటివారు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నిన్న మొన్నటి వరకూ పుణ్యక్షేత్రాలోన్ని ఘాట్ రోడ్లలో, నడక మార్గాల్లో సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతలు ఇప్పుడు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత అక్కడ ఉన్న రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో ఆ ఇంటివారు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సున్నిపెంటలోని రామాలయం సమీపంలో చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి ఎత్తయిన ప్రహరీ గోడ దూకి ఓ ఇంట్లోకి చొరబడింది. తలుపులన్నీ మూసి ఉండటంతో లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. కానీ ఆ ఇంటి అరుగుపై ఉన్న రెండు పెంపుడు కుక్కలపై దాడి చేసింది చిరుత. చిరుత దాడిలో రెండు కుక్కలూ చనిపోయాయి. కాగా ఓ కుక్కను అక్కడే వదిలి మరో కుక్కను నోటకరుచుకుని చిరుత వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు
టైర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృ**తి..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

