AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాజా అల్‌–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు

గాజా అల్‌–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు

Phani CH
|

Updated on: Nov 19, 2023 | 8:52 PM

Share

హమాస్‌ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది.

హమాస్‌ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌ సేనలు భీకరస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాలస్తీనియన్లకు మానవతా సాయం అందడం లేదు. ఆహారం, ఔషధాలు, నిత్యావసరాలను గాజాకు చేరవేయలేకపోతున్నామని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆకలి చావులు ప్రారంభం కావడం తథ్యమని తేల్చిచెప్పింది. మరోవైపు గాజాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఊహించినదాని కంటే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పెట్రోల్, డీజిల్‌ నిల్వలు నిండుకున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!

లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్‌ ఏం చేశాడో తెలుసా ??

Naga Chaitanya: సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య !!

స్విగ్గీ ఆర్డర్లో మరో ఘోరం.. ఈసారి ఫుడ్‌లో డేంజరస్ టుబాకో ప్రొడెక్ట్