టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!

టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!

Phani CH

|

Updated on: Nov 19, 2023 | 8:51 PM

చాట్‌జీపీటీ (Chatgpt ) రూపకల్పతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన శామ్‌ ఆల్ట్‌మన్‌ను ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో బాధ్యతలు నుంచి తప్పించింది. ఆల్ట్‌మన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని, స్థిరంగా, నిష్కపటంగా ఉండడం లేదని పేర్కొంది. బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో అతడు నిజాయతీగా ఉండడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని పేర్కొన్న ఓపెన్ ఏఐ.. బోర్డు నిర్ణయాలకు కూడా ఆల్ట్‌మన్ అడ్డుపడుతున్నారని పేర్కొంది.

చాట్‌జీపీటీ (Chatgpt ) రూపకల్పతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన శామ్‌ ఆల్ట్‌మన్‌ను ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో బాధ్యతలు నుంచి తప్పించింది. ఆల్ట్‌మన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని, స్థిరంగా, నిష్కపటంగా ఉండడం లేదని పేర్కొంది. బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో అతడు నిజాయతీగా ఉండడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని పేర్కొన్న ఓపెన్ ఏఐ.. బోర్డు నిర్ణయాలకు కూడా ఆల్ట్‌మన్ అడ్డుపడుతున్నారని పేర్కొంది. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది. చర్చాత్మక సమీక్ష ప్రక్రియ అనంతరం ఆయనను తొలగించినట్టు తెలిపింది. అంతేకాదు, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీ సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్‌మన్‌ తొలగింపు నిర్ణయం టెక్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. 38 ఏళ్ల ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ విడుదలతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. మానవ మేధను మరో మెట్టు ఎక్కించిన ఆయన తొలగింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్‌ ఏం చేశాడో తెలుసా ??

Naga Chaitanya: సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య !!

స్విగ్గీ ఆర్డర్లో మరో ఘోరం.. ఈసారి ఫుడ్‌లో డేంజరస్ టుబాకో ప్రొడెక్ట్