ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మాక్ డ్రిల్ ను సీఎం రేవంత్ స్వయంగా పరివేక్షించనున్నారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయలుదేరి రావాలని సూచించారు. మాక్ డ్రిల్ ను పరివేక్షించాలని భట్టికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో నగరాల్లో ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలి అనే దానిపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి అనే దానిపై ఈ రిహార్సల్స్ చేపట్టారు.
హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్.. వార్ సైరన్ల మోత వీడియో
హైదరాబాద్ వ్యాప్తంగా నేడు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నగరమంతా సైరన్ల మోత మోగనుంది. సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీవో, మౌలా అలీ, ఎన్ఎఫ్సి లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డిఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
