ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో నేపథ్యంలో ఇప్పుడు హాంగ్ కాంగ్‌లో జరిగిన మరో విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై అదుపుతప్పిన ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు.
సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం నార్త్ రన్‌వేపై దిగింది. ఈ నేపథ్యంలో విమానం అదుపుతప్పి.. ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఓ గ్రౌండ్ -సర్వీస్ వాహనాన్ని ఢీట్టింది. అనంతరం సముద్రంలో పడింది. విమానం దూసుకెళ్తున్న సమయంలో రన్‌వేపై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు. దీంతో ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్ లైన్స్ సంస్థ ఎమిరేట్స్ నుంచి లీజుకు తీసుకొని నడుపుతుంది. టర్కిష్ క్యారియర్ ఎయిర్ ACT నడుపుతున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానం EK9788, దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ రన్‌వే 07Rను తాకినప్పుడు సోమవారం తెల్లవారుజామున 3.53 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని హాంకాంగ్ స్టాండర్డ్ రిపోర్ట్ వెల్లడించింది. మరోవైపు విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హాంకాంగ్ ప్రభుత్వం రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలను పంపినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత కనీసం 11 కార్గో విమానాల రాకపోకలను రద్దు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి.. కారణం..
చిరు ఇంట తారల దీపావళి వేడుక నాగ్, వెంకీ, నయన్‌ల సందడి
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంతంటే ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

