AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి.. కారణం..

ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి.. కారణం..

Phani CH
|

Updated on: Oct 21, 2025 | 8:22 PM

Share

దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. ఈ వెలుగుల పండుగను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంట్లో దీపాలు వెలిగించి ప్రత్యేక వంటకాలతో కుటుంబమంతా కలిసి సరదాగా వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంటారు.

ఇక ఈ పండుగకు కేవలం దీపాల వెలుగులే కాదు.. టపాసుల మోత కూడా ఉంటుంది. సాయంత్ర వేళ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తారు. టపాసుల మోతతో నగరాలు, పట్టణాలు దద్దరిల్లాల్సిందే. అయితే, తమిళనాడు రాష్ట్రంలోని ఏడు గ్రామాలు మాత్రం ‘నిశ్శబ్ద దీపావళి’ని జరుపుకున్నాయి. ఈరోడ్‌ జిల్లా లోని సెల్లప్పంపాళయం, వడముగం వెల్లోడే‌, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వాలాసు, పుంగంపాడి గ్రామాలు వెల్లోడ్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉంటాయి. అక్కడ అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య దేశ విదేశాల నుంచి పక్షులు వలస వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతాయి. సాధారణంగా దీపావళి పండుగ కూడా అక్టోబర్‌-నవంబర్‌ నెలల మధ్య వస్తుంది కాబట్టి.. ఆ పక్షులకు అనువైన వాతావరణం కల్పించేందుకు, వాటిని భయపెట్టకుండా ఉండేందుకు ఆ గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్షలు కేంద్రానికి చుట్టుపక్కల నివసించే సుమారు 900కుపైగా కుటుంబాలు బాణసంచా పేల్చకుండానే దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 22 ఏళ్లుగా వారు ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీపావళి సందర్భంగా తమ పిల్లలకి కొత్త బట్టలు కొనివ్వడంతోపాటు, శబ్దం రాని కాకరపూవొత్తులు వంటి వాటిని కాల్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ యేడు కూడా ఆ గ్రామాల ప్రజలు దీపావళిని ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరు ఇంట తారల దీపావళి వేడుక నాగ్, వెంకీ, నయన్‌ల సందడి

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంతంటే ??

సమంత దీపావళి సెలబ్రేషన్స్‌రాజ్‌ నిడిమోరు కుటుంబంతో

బంగాళాఖాతంలో అల్పపీడనం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

అద్భుతం.. శ్రీకృష్ణుడి విగ్రహానికి చూపులేని లేగ ప్రదక్షిణలు