Hamas warns Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..

Hamas warns Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..

Anil kumar poka

|

Updated on: Aug 03, 2024 | 5:40 PM

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ఐక్యరాజ్యసమితి, పలు ప్రపంచదేశాలు కాల్పులు విరమించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితి మారడం లేదు. ఈ నేపథ్యంలో హమాస్‌ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ బుధవారం ప్రకటించింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ఐక్యరాజ్యసమితి, పలు ప్రపంచదేశాలు కాల్పులు విరమించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితి మారడం లేదు. ఈ నేపథ్యంలో హమాస్‌ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ బుధవారం ప్రకటించింది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ను ఉటంకిస్తూ ఈ కథనం ప్రసారం చేసింది. మరోవైపు హమాస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిని ఇజ్రాయెల్‌ దాడిగా అభివర్ణించింది.

టెహ్రాన్‌లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా, ఆయన బాడీగార్డ్‌ మృతి చెందినట్లు పేర్కొంది. హనియా ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. కాగా, హనియా మరణంపై హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జుక్‌ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇది కుట్రపూరిత చర్య అని, దీనికి బదులు తప్పదు అంటూ ఇజ్రాయెల్‌పై ప్రతీకార హెచ్చరికలు చేశాడు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలోనే తమ చీఫ్‌ మృతి చెందాడని హమాస్‌ ఆరోపించింది. అటు ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌ తీవ్రంగా ఖండించారు. హనియా మృతి వార్తల కథనాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తెలుసుకుంది. అయితే, వాటిపై స్పందించేందుకు మాత్రం వైట్‌హౌష్ అధికార ప్రతినిధి నిరాకరించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ మాత్రం ఈ ఘటనపై ఎటువంటి ప్రకటనా చేయలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.