అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోండి.. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కొత్త స్వరం
డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. విదేశీ నిపుణులు అమెరికన్లకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు తాత్కాలికంగా మాత్రమే అనుమతించబడతారు. దీర్ఘకాలిక ఉద్యోగాలకు కాదని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. తయారీ రంగాలను అమెరికాకు తిరిగి తీసుకురావడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ నూతన విధానం లక్ష్యం.
హెచ్-1బీ వీసా విధానంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా కొత్తపాట అందుకున్నారు. తమదేశంలో ప్రతిభావంతులు లేరని, వివిధ రంగాల్లో ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకోవడం తమకు తప్పనిరి అని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే హెచ్-1బీ ఉద్యోగులు అని అన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలని అన్నారు. వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం ఇదేనని వెల్లడించారు. అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇకపై విదేశీ నిపుణులను దీర్ఘకాలిక ఉద్యోగాల కోసం కాకుండా అమెరికన్లకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు తాత్కాలికంగా దేశంలోకి అనుమతించనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే ట్రంప్, కొన్ని రంగాల్లో విదేశీ ప్రతిభ అవసరమని చెప్పిన నేపథ్యంలో బెస్సెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కొత్త విధానాన్ని స్కాట్ బెస్సెంట్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియగా అభివర్ణించారు. దశాబ్దాలుగా ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికా తయారీ రంగాన్ని తిరిగి దేశంలో పునరుద్ధరించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని ఆయన మీడియాకు తెలిపారు. గత 30 ఏళ్లుగా తాము అత్యంత కచ్చితత్వంతో కూడిన తయారీ రంగ ఉద్యోగాలను విదేశాలకు పంపించేశామని, ఇప్పుడు రాత్రికి రాత్రే నౌకలు తయారు కావని పేర్కొన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమను తిరిగి అమెరికాకు తీసుకురావాలనుకుంటున్నామని, ఇందుకోసం అరిజోనాలో భారీ పరిశ్రమలు రానున్నాయని ఆయన వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. అవసరమైన నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను మూడు, ఐదు, ఏడేళ్ల కాలానికి ఇక్కడికి తీసుకువస్తారు. వారు అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇచ్చిన తర్వాత తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవచ్చు. శిక్షణ పొందిన అమెరికన్ కార్మికులు ఆ ఉద్యోగాలను చేపడతారు అని బెస్సెంట్ అన్నారు. విదేశీయుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళనలను బెస్సెంట్ తోసిపుచ్చారు. “ఆ ఉద్యోగాలు ప్రస్తుతం ఒక అమెరికన్ చేయలేరు. ఎందుకంటే ఆ నైపుణ్యం ప్రస్తుతానికి మన దగ్గర లేదు. చాలా ఏళ్లుగా మనం ఇక్కడ నౌకలు గానీ, సెమీకండక్టర్లు గానీ తయారుచేయడం లేదు. కాబట్టి విదేశీ భాగస్వాములు వచ్చి అమెరికన్ కార్మికులకు నైపుణ్యాలు నేర్పించడం దేశానికి ఒక ‘హోమ్ రన్’ లాంటిది” అని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త హెచ్-1బీ విధానం, కీలక పరిశ్రమలను తిరిగి స్వదేశానికి రప్పించి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న ట్రంప్ విస్తృత లక్ష్యంలో భాగమని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండోసారి చోరికి వచ్చి.. జనానికి దొరికిపోయిన దొంగలు
ఆ రోడ్డు కింద 5 వేల టన్నుల బంగారం.. ఎక్కడంటే ??
ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా.. హైవేలపై QR కోడ్ బోర్డులు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

