ఆ రోడ్డు కింద 5 వేల టన్నుల బంగారం.. ఎక్కడంటే ??
లండన్‌లోని థ్రెడ్‌నీడిల్ స్ట్రీట్‌లో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ భూగర్భంలో అపారమైన బంగారు నిల్వలున్నాయి. 5,000 టన్నుల విలువైన ఈ బంగారం రూ.63 లక్షల కోట్ల పైనే. ప్రపంచంలోని అయిదో వంతు బంగారాన్ని భద్రపరుస్తున్న ఈ వాల్ట్, న్యూయార్క్ తర్వాత రెండో అతిపెద్దది. రాజకీయ స్థిరత్వం కారణంగా ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఇక్కడ తమ బంగారాన్ని దాచుకుంటాయి. పటిష్టమైన భద్రత దీని ప్రత్యేకత.
ఆ వీధిలో టన్నుల కొద్దీ బంగారంపైనే నిత్యం రయ్‌రయ్‌మంటూ కార్లూ, బస్సులూ పరుగులు తీస్తాయి. నగరంలోని వారు విలువైన నిధినిక్షేపాల పై నుంచే అటూ ఇటూ తిరిగేస్తుంటారు. అంత బంగారం ఏంటీ, దాని మీద నుంచి నడవడం ఏంటీ- అంతా విచిత్రంగా ఉందా! సాధారణంగా మనం బంగారంతో నిండిన గదుల్నీ, ఒకదానిమీద ఒకటి పేర్చిన బంగారు కడ్డీలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ టన్నుల కొద్దీ బంగారంతో నిండిన అలాంటి చోటు నిజంగానే ఉంది. ఎక్కడో ప్రపంచానికి దూరంగానో, తెలియని ప్రదేశంలోనో కాదు… లండన్ నగరంలోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్‌లో. ప్రపంచంలోని అయిదో వంతు బంగారం- కడ్డీలూ, ఇటుకల రూపంలో ఈ వీధిలోనే కొలువై ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ భూగర్భంలో భద్రంగా దాచిన బంగారమే అదంతా. భూమి లోపల నిర్మించిన ఈ వాల్ట్ ప్రపంచంలోని అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఒకటి. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న రెండో అతిపెద్ద స్వర్ణాగారమిదే! ఈ బ్యాంక్‌లో దాదాపు 4,00,000 బంగారు కడ్డీలున్నాయి. ఒక్కో కడ్డీ బరువు 12.5 కిలోగ్రాములు. మొత్తం బంగారం బరువు సుమారుగా 5,000 టన్నులు. దీని విలువ రూ.63 లక్షల కోట్ల పైనే. ఈ స్వర్ణనిధిలో దాదాపు 94 శాతం ప్రపంచంలోని 30కి పైగా దేశాల కేంద్ర బ్యాంకులూ, పెద్ద పెద్ద సంస్థలదే. కేవలం 6 శాతమే లండన్‌కు చెందింది. చాలా కాలంగా లండన్ ప్రపంచ బంగారు మార్కెట్‌కు కేంద్రంగా ఉంది. రాజకీయ స్థిరత్వం ఉన్న దేశం లండన్ కావడంతో చాలా దేశాలు తమ బంగారాన్ని ఇక్కడ సురక్షితంగా దాస్తున్నాయి. ఈ బంగారం రక్షణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కఠిన భద్రతను అమలు చేస్తోంది. బాంబులను కూడా తట్టుకునేలా ఈ వాల్ట్ గోడల్ని నిర్మించింది. దృఢమైన లోహాలతో వీటి తలుపులు రూపొందించింది. దొంగలు డ్రిల్ చేసి లోపలికి రావడానికి ప్రయత్నించినా.. అది అసాధ్యమే. ఈ బ్యాంక్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా దొంగతనం జరగలేదంటే… దీని భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా.. హైవేలపై QR కోడ్ బోర్డులు
వింత ఘటన.. గేదెకు ఒకే ఈతలో రెండు లేగ దూడలు
వివాహ వేదికపై పుష్-అప్‌లు ఇప్పుడిదో నయా ట్రెండ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

