AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పేరుతో ఇంకో సిమ్ యాక్టివేషన్.. తర్వాత విదేశాలకు అమ్మకం

మీ పేరుతో ఇంకో సిమ్ యాక్టివేషన్.. తర్వాత విదేశాలకు అమ్మకం

Phani CH
|

Updated on: Nov 14, 2025 | 2:55 PM

Share

విశాఖలో భారీ నకిలీ సిమ్ రాకెట్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. కస్టమర్ల ఐడీలతో వారికి తెలియకుండా వందలాది సిమ్‌లు యాక్టివేట్ చేసి, వాటిని బెట్టింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్ వ్యూస్ పెంచడానికి ఉపయోగించారు. కంబోడియా, థాయిలాండ్ సైబర్ ముఠాలకు కూడా వీటిని విక్రయించారు. వొడాఫోన్ డిస్ట్రిబ్యూటర్, అతని సహాయకుడిని అరెస్ట్ చేయడంతో అంతర్జాతీయ సైబర్ మోసాల గుట్టు రట్టయ్యింది.

దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ, మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. కస్టమర్ల ఐడీలతో కస్టమర్లకి తెలియకుండా నకిలీ సిమ్ కార్డులు యాక్టివేట్ చేసిన ముఠా గుట్టు రట్టుయ్యింది. ఒక సిమ్ కార్డ్ తో సుమారు 5 నుంచి 6 జీ మెయిల్ ఖాతాలు, 20 సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి వాటితో బెట్టింగ్, బ్రాండ్స్ ప్రమోషన్స్, యూట్యూబ్ వ్యూస్ పెంచటం వంటివి చేస్తున్నారు. కంబోడియా, థాయిలాండ్ దేశాలలో ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకి సోషల్ మీడియా అక్కౌంట్స్ అందిస్తున్న వొడాఫోన్ సిమ్ డిస్ట్రిబ్యూటర్‌, అతని సహాయకుడిని విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు పెరుగుతుండడంతో.. వాటి మూలాలపై పోలీసులు దృష్టిసారించారు. నేరాలు జరుగుతున్న తీరు, నేరాల కోసం నేరగాళ్లు వినియోగిస్తున్న నెట్ వర్కు, సోషల్ మీడియా అకౌంట్స్ పై దృష్టి సారించారు. విశాఖలో కూబి లాగితే లింకు నిడదవోలు, తాడేపల్లిగూడెంలో దొరికింది. సీపీ.. శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ నియంత్రణ చర్యలో భాగంగా.. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం పేరుతో కస్టమర్ల ఐడీలను.. కస్టమర్ లకి తెలియకుండా వందలాది నకిలీ సిమ్ కార్డులను అక్రమంగా యాక్టివేట్ చేస్తునారనే పక్కా సమాచారం తో నిడదవోలు, తాడేపల్లిగూడెం కి చెందిన ఇద్దరు వ్యక్తుల కదలికలపై పత్యేకమైన నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన గంటా రామకృష్ణ నిడదవోలులో వోడాఫోన్ డిస్ట్రిబ్యూటర్. సిమ్‌లను యాక్టివేట్ చేసేవాడు. ఈ క్రమంలో రామకృష్ణ, అతని సహాయకుడు వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన అడపా కొండబాబు తో కలిసి అధిక సంపాదన కోసం.. అడ్డదారి తొక్కారు. దీంతో పాయింట్ ఆఫ్ సేల్ – POS వద్ద కి వచ్చిన కస్టమర్ల ఐరిస్, థంబ్ సరిగా పడలేదని చెప్పి.. వారినుంచి మరోసారి ఐరిస్, వేలిముద్రలు తీసుకొని, కస్టమర్ పేరు మీద ఇంకో నెంబర్ ని యాక్టివేట్ చేసేవారు. ఇలా 500 నుండి 600 సిమ్ లు యాక్టివేట్ చేశారు. వీటిని కొన్నిసైబర్ నేరగాళ్లకి, మరికొన్ని కొండబాబు, శరత్, వెంకటేశ్‌లకు ఇచ్చేవారు. ఈ సిమ్‌ల సాయంతో కొండబాబు, శరత్ ,వెంకటేశ్ యూట్యూబ్, జి మెయిల్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయటం , యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ కి పెయిడ్ బేస్డ్ వ్యూ స్ పెంచటం, నకిలీ సోషల్ మీడియా అక్కౌంట్స్ ఓపెన్ చేయటం చేసేవారు. ఇలా క్రియేట్ చేసిన నకిలీ సోషల్ మీడియా అకౌంట్ వెరిఫికేషన్ కి OTP సదరు జిమెయిల్ కి రావడం జరిగేది. అందుకుగాను అధిక సంఖ్యలో జి మెయిల్ అకౌంట్ అవసరం ఉన్నందున నకిలీ ద్వారా ఇలా వేల సంఖ్యలో ఫేక్ జీ మెయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసి తద్వారా వేల సంఖ్యలో నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసేవారు. ఇలా ఓపెన్ చేసిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లో థాయిలాండ్, కాంబోడియన్ దేశాల్లో ఉన్న సైబర్ నేరస్థులకు అందజేసే వారికి సాయం చేసేవారు.ఈ విధంగా కస్టమర్‌కి తెలియకుండా వేరొక సిమ్ ను యాక్టివేట్ చేసి దానిని సబ్ ఏజెంట్ అయిన వెంకటేష్ ద్వారా యాక్టివేట్ అయిన సిమ్ లును కొండబాబు , శరత్ లు తీసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అంతర్జాతీయ సైబర్ నేరస్థులు తో సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో గంటా రామకృష్ణ, అడపా కొండబాబులపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, టోల్ ఫ్రీ నెంబర్ 1930, సీపీ నెంబర్ 7995095799, కాల్ చేసి ఫిర్యాదు చేయగలరని పోలీసులు ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Time Bank in Kerala: కేరళలో ‘టైమ్ బ్యాంక్‌’.. ఏం దాచుకుంటారంటే

65 ఏళ్లుగా నిద్రపోని రైతన్న.. ఆశ్చర్యపోతున్న వైద్యులు

వింత ఘటన.. ఒకే మొక్కకు 3 రకాల కూరగాయలు

ఇదేం.. ఖర్మ రా నాయనా !! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

చిట్టి చేతులతో.. ముద్దుగా మట్టి బొమ్మలు అర్హ క్యూట్ వీడియో