AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Time Bank in Kerala: కేరళలో 'టైమ్ బ్యాంక్‌'.. ఏం దాచుకుంటారంటే

Time Bank in Kerala: కేరళలో ‘టైమ్ బ్యాంక్‌’.. ఏం దాచుకుంటారంటే

Phani CH
|

Updated on: Nov 14, 2025 | 2:50 PM

Share

కేరళలోని ఎలికుళం పంచాయతీ 'టైమ్ బ్యాంక్' ను ప్రారంభించింది. వాలంటీర్లు వృద్ధులకు సేవ చేస్తే, ఆ సమయాన్ని వారి ఖాతాలో జమ చేస్తారు. భవిష్యత్తులో వారికి సేవ అవసరమైనప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. వృద్ధుల్లో ఒంటరితనాన్ని తగ్గించి, ఆరోగ్య సంరక్షణ అందించడం, యువతలో సామాజిక బాధ్యతను పెంచడం ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శం.

కేరళ ఓ టైమ్ బ్యాంకును ఏర్పాటు చేసింది. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటాం కదా.. అలా టైమ్‌ బ్యాంకులో సమయాన్ని దాచుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు ఆ సమయాన్ని తిరిగి తీసుకోవచ్చు. జపాన్‌ స్ఫూర్తితో సామాజిక సేవా రంగంలో కేరళ మరో ముందడుగు వేసింది. కేరళలోని కొట్టాయం జిల్లా ఎలికుళం పంచాయితీ… ‘టైమ్ బ్యాంక్’ సామాజిక సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది. ఎలికుళం పంచాయితీలో ఉన్న 7,500 మంది సీనియర్ సిటిజన్‌ల వివరాలను వాలంటీర్ల బృందం సేకరించింది. ఒక యువ వాలంటీర్ వృద్ధుడికి ఒక గంట సేవ చేస్తే.. అంటే అవసరం ఉన్న వృద్ధులకు మందులు కొనివ్వడం, బిల్లులు చెల్లించడం, మాట్లాడటానికి సమయం ఇవ్వడం వంటివి చేస్తే ఆ సయమాన్ని అతడి పేరిట డిపాజిట్ చేస్తారు. ముఖ్యంగా ‘టైమ్ బ్యాంక్’ ఖాతాలో ఒక గంట క్రెడిట్‌గా జమ చేస్తారు. ఈ వాలంటీర్‌కు భవిష్యత్తులో అంటే 60 ఏళ్లు దాటిన తర్వాత సేవ అవసరమైనప్పుడు.. వారు తమ ఖాతాలో ఉన్న క్రెడిట్‌ను ఉపయోగించి మరొక వాలంటీర్ నుంచి సేవలను పొందవచ్చు. ఈ బ్యాంకు ముఖ్య ఉద్దేశం.. వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టడం. అలాగే వారికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ, రోజువారీ సహాయం అందించడం. అలాగే యువతలో సామాజిక బాధ్యతను పెంచడానికి, తరాల మధ్య అంతరాన్ని తగ్గించడం అన్నమాట. దేశంలో వృద్ధాప్య జనాభా పెరుగుతుండడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఈ ‘టైమ్ బ్యాంక్’ మోడల్‌ను అనుసరించాలని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

65 ఏళ్లుగా నిద్రపోని రైతన్న.. ఆశ్చర్యపోతున్న వైద్యులు

వింత ఘటన.. ఒకే మొక్కకు 3 రకాల కూరగాయలు

ఇదేం.. ఖర్మ రా నాయనా !! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

చిట్టి చేతులతో.. ముద్దుగా మట్టి బొమ్మలు అర్హ క్యూట్ వీడియో

ఆటోలో దూసుకెళ్తున్న డ్రైవర్‌.. వెనుక సీటులో ఉన్నది చూసి..