AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత ఘటన.. ఒకే మొక్కకు 3 రకాల కూరగాయలు

వింత ఘటన.. ఒకే మొక్కకు 3 రకాల కూరగాయలు

Phani CH
|

Updated on: Nov 14, 2025 | 1:56 PM

Share

ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతు పొలంలో అరుదైన మిరప మొక్క అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకే మొక్కకు మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కాయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇది దైవ మహత్యమని కొందరు, శాస్త్రీయ కారణం ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. నిపుణుల ప్రకారం, ఈ మూడు 'సొలనేసి' కుటుంబానికి చెందినవి కావడం, జెనెటిక్ మిక్సింగ్ లేదా గ్రీఫ్టింగ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చు.

విత్తు ఒకటైతే.. చెట్టు ఒకటవుతుందా అనేది నానుడి. మామిడి టెంక నాటితే మామిడికాయలే కాస్తాయి కానీ అరటికాయలో, ఉసిరికాయలో ఆ చెట్టుకు కాయవు కదా.. ఇది నూటికి నూరు శాతం నిజం. అదీ ఎప్పటివరకు అంటే.. మీరు ఈ వీడియో చూడడానికి ముందు వరకు. ఒక చెట్టుకి మూడు రకాల కూరగాయలు ఎక్కడైనా కాస్తాయా? అవును కాసాయి. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒక చెట్టుకు ఒకే రకమైన కాయలు కాయడం ప్రకృతి ధర్మం. కానీ, దానికి విరుద్ధంగా ఒకే మొక్కకు మూడు రకాల కాయలు కాసిన అరుదైన అద్భుతమైన ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడుకు చెందిన రైతు ముత్యాల రజిత రమేశ్ తన పొలంలో మిరప తోటను సాగు చేస్తున్నారు. తన తోటలోని రెండు మిరప మొక్కలకు మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కూడా కాయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ వింత విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో, ఈ అరుదైన మొక్కలను చూసేందుకు జనం ఆయన పొలానికి తరలివచ్చారు. ఈ వింత మొక్కను చూసి ఇదంతా దైవ మహత్యం అంటూ చర్చించుకున్నారు స్థానికులు. మరికొందరు దీని వెనుక ఏదో శాస్త్రీయ కారణం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై స్థానిక వ్యవసాయ అధికారులు ఏం చెప్పారంటే.. మొక్కల జెనెటిక్ మిక్సింగ్ లేదా గ్రీఫ్టింగ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చన్నారు. మిరప, టమాటా, వంగ.. ఈ మూడు ‘సొలనేసి’ అనే ఒకే వృక్ష కుటుంబానికి చెందినవని, అందువల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది అని నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం.. ఖర్మ రా నాయనా !! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

చిట్టి చేతులతో.. ముద్దుగా మట్టి బొమ్మలు అర్హ క్యూట్ వీడియో

ఆటోలో దూసుకెళ్తున్న డ్రైవర్‌.. వెనుక సీటులో ఉన్నది చూసి..

బియ్యం ధర గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌.. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

ఆధార్‌ వినియోగదారులకు మరో గుడ్‌ న్యూస్‌