65 ఏళ్లుగా నిద్రపోని రైతన్న.. ఆశ్చర్యపోతున్న వైద్యులు
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న థాయ్ అంజోక్ కథ. వియత్నాంకు చెందిన ఈ రైతు 65 ఏళ్లుగా నిద్రకు దూరమయ్యాడు. 1962 వియత్నాం యుద్ధం తర్వాత అతనికి నిద్ర కరువైంది. వైద్యులు పరీక్షించినా, అతని ఆరోగ్యం, రోగనిరోధక శక్తి సాధారణంగా ఉండటం విస్మయపరుస్తోంది. 80 ఏళ్ల వయసులోనూ పొలంలో పనిచేస్తున్న ఈయన జీవితం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు మర్నాడు ముఖం వేలాడేసుకుని, నీరసంగా కనిపిస్తాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 65 ఏళ్లుగా నిద్రకు దూరమైన వ్యక్తి పరిస్థితేంటో చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. థాయ్ అంజోక్.. ప్రపంచంలో 65 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. ఈ వియత్నాం దేశపు రైతన్న జీవితం నుంచి నిద్ర దూరమైంది. అతను నిద్రపోవడాన్ని భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. థాయ్ అంజోక్‌కు ఇప్పుడు 80 ఏళ్లు దాటాయి. 1962లో వియత్నాం యుద్ధం సమయంలో 20 ఏళ్ల వయసులో ఓ రోజు రాత్రి అతనికి తీవ్ర జ్వరం వచ్చిందట. తర్వాత జ్వరం తగ్గింది కానీ అప్పటి నుంచి కంటి మీద కునుకు కరువైంది. హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. సాధారణంగా నిద్రలేమి శారీరక, మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుదీర్ఘ కాలం నిద్ర లేకుండా బతకడం సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల మాట. థాయ్ అంజోక్‌ను పరీక్షించిన వైద్యులు అతని రక్తపోటు రోగనిరోధకశక్తి సాధారణంగా ఉండటం చూసి షాకయ్యారు. థాయ్ అంజోక్ 80 ఏళ్ల వయసులోనూ పొలంలో పనిచేస్తుంటారు. గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో రాత్రి మూడు వరకు డ్యూటీలో ఉంటారు. మందులు వేసుకున్నా, నాటు సారా, రైస్ వైన్ తాగినా అతనికి నిద్ర పట్టడం లేదట. రాత్రి వేళల్లో ఇతరులంతా నిద్రపోతూ ఉంటే, అతను మాత్రం పొలంలో పనులు చేస్తాడు. విదేశాల నుంచి వైద్య శాస్త్రవేత్తలు అతన్ని పరీక్షించేందుకు వస్తుంటారు. వియత్నాం యుద్ధం తర్వాత ఏర్పడిన ట్రామాటిక్ స్ట్రెస్ అతని నిద్రలేమికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత ఘటన.. ఒకే మొక్కకు 3 రకాల కూరగాయలు
ఇదేం.. ఖర్మ రా నాయనా !! ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
చిట్టి చేతులతో.. ముద్దుగా మట్టి బొమ్మలు అర్హ క్యూట్ వీడియో
ఆటోలో దూసుకెళ్తున్న డ్రైవర్.. వెనుక సీటులో ఉన్నది చూసి..
బియ్యం ధర గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

