AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్.. 300 ఉచిత స్కాలర్‌షిప్‌లు

మన విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్.. 300 ఉచిత స్కాలర్‌షిప్‌లు

Phani CH
|

Updated on: Nov 14, 2025 | 5:31 PM

Share

ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయంతో అమెరికాలో ఉన్నత విద్య కలలు కలలుగానే మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో, భారతీయ విద్యార్థులకు రష్యా ప్రభుత్వం శుభవార్త అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి 300 ఫుల్లీ ఫండెడ్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ సహా పలు కోర్సుల్లో ప్రముఖ రష్యన్ యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం ఇది. ట్యూషన్ ఫీజు ఉచితం. education-in-russia.com ద్వారా జనవరి 15, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఉన్నత విద్యనభ్యసించాలని అందరూ అనుకుంటారు. అందుకోసం కొందరు విదేశాలకు వెళ్తుంటారు. అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత చదువులు చదువుతూ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయంతో అమెరికాలో విదేశీయుల ఉన్నత విద్య కలలు కలలుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారతీయ విద్యార్ధులకు రష్యా ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. భారతీయ విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను 300 ఫుల్లీ ఫండెడ్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా ప్రముఖ రష్యన్ విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా చదువుకునే అవకాశం లభించనుంది. ఈ స్కాలర్‌షిప్‌లు అండర్ గ్రాడ్యుయేట్, స్పెషలిస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లతో పాటు పలు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోర్సులకు వర్తిస్తాయి. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితం. అయితే, లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ, ఎంజీఐఎంవో యూనివర్సిటీలకు ఈ ఫీజు మినహాయింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్, గణితం, స్పేస్ సైన్స్, ఏవియేషన్, క్రీడలు, కళలు వంటి అనేక విభాగాల్లో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కొన్ని ప్రోగ్రామ్‌లు ఇంగ్లిష్ మీడియంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక రష్యన్ భాష రాని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వారి కోసం ప్రధాన కోర్సు ప్రారంభానికి ముందు ఏడాది పాటు ప్రత్యేకంగా భాషా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ education-in-russia.com ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరని తెలిపింది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో అకడమిక్ ప్రతిభ, రీసెర్చ్ పబ్లికేషన్లు, సిఫార్సు లేఖలు, పోటీ పరీక్షల్లో సాధించిన సర్టిఫికెట్ల ఆధారంగా దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు రెండో దశకు అర్హత సాధిస్తారు. ఈ దశలో రష్యా విద్యా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ యూనివర్సిటీ కేటాయింపు, వీసా ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. మొదటి దశ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జనవరి 15. కాగా, ఈ స్కాలర్‌షిప్‌ల ఎంపిక ప్రక్రియలో తమకు ఎలాంటి పాత్ర లేదని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సత్తాచాటిన తెలుగోడు.. శ్రీనగర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఆ 3 గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడు?

అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోండి.. హెచ్​-1బీ వీసాలపై ట్రంప్‌ కొత్త స్వరం

రెండోసారి చోరికి వచ్చి.. జనానికి దొరికిపోయిన దొంగలు

ఆ రోడ్డు కింద 5 వేల టన్నుల బంగారం.. ఎక్కడంటే ??