AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 3 గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడు?

ఆ 3 గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడు?

Phani CH
|

Updated on: Nov 14, 2025 | 5:18 PM

Share

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడుపై NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ ప్రమేయం, ఎర్రకోట వద్ద 3 గంటల పాటు కారులో వేచి ఉండటం, అతని ఫోన్ మిస్టరీపై అధికారులు దృష్టి సారించారు. రెక్కీ నిర్వహణ, ప్లాన్ మార్పు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు.

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు, ఎఫ్​ఎస్​ఎల్​ సహా అనేక సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా మూడు కోణాల్లోనే దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఎర్రకోట సమీపంలో పార్క్ చేసిన మూడు గంటల సమయంలో ఏం జరిగింది? అన్న అంశం చుట్టే ఎక్కవగా ఫోకస్​ చేశారు. ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడా? రద్దీ ఎక్కువయ్యే సమయం కోసం వేచి చూశాడా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకున్నారు. అలాగే, డాక్టర్​ ఉమర్ ఉపయోగించిన టెలిగ్రామ్​ గ్రూపు గుట్టు విప్పడంపై కూడా అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నాం 3 గంటల 19 నిమిషాలకు ఎర్రకోట దగ్గరికి వచ్చిన కారు.. సాయంత్రం 6 గంటల 28 నిమిషాల వరకు అక్కడే పార్క్‌ చేసి ఉంది. అంటే దాదాపు 3 గంటల పాటు కారు అక్కడే ఉంది. ఆ సమయంలో ఉమర్ మహమ్మద్ కారులోనే ఉన్నాడు. అతను కారు దిగడం కానీ.. డోర్ ఓపెన్ చేయడం కానీ చేయలేదని సీసీ ఫుటేజ్ లో స్పష్టమైంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. అతను అంత సేపు కారులో ఎందుకు ఉండిపోయాడు? అక్కడే ఉండి .. ముందుగా అనుకున్న ప్లాన్‌ను అమలు చేయాలనుకున్నాడా? లేకుంటే మరో ఆలోచన చేస్తూ అంతసేపు అతడు అక్కడే ఉండిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శీతాకాలం కావడంతో సాయంత్రం వేళ.. ఎర్రకోట వద్దకు భారీగా ప్రజలు చేరుకుంటారు. అందుకే అతను కారు వెనుక సీటులో డిటోనేటర్లు పెట్టుకుని ఎర్రకోటకు వచ్చాడు. కానీ సోమవారం ఎర్రకోటకు సెలవు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అతడు గుర్తించాడు. దీంతో మరో ప్రాంతానికి వెళ్లాలా? అనే ఆలోచన ఉమర్ మహమ్మద్‌లో మొదలై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలా అక్కడి నుంచి డాక్టర్ ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్‌కు చేరుకున్నాడు. కాసేపటికే కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 12 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బాంబు పేలుడు తర్వాత పోలీసులు రంగంలోకి దిగి.. కారు ప్రయాణించిన మార్గాన్ని ట్రాక్ చేశారు. అందుకోసం దాదాపు 1000 సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఉదయం గంటలకు ఢిల్లీలోకి ఉమర్ ప్రవేశించగా.. దాదాపు 11 గంటల తరువాత పేలుడు సంభవించింది. ఈ మధ్యలో అతను ఏం చేశాడనే విషయాన్ని తెలుసుకోవడంపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇక అతని ఫోన్‌ గురించి పోలీసులు ఆరా తీయగా.. ఇక్కడా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఉమర్ తన ఫోన్‌ను 10 రోజుల ముందే స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. అయితే ఉమర్ ఫోన్ లేకుండా ఎలా ఉన్నాడు. ఈ బాంబు దాడి వెనుక ఉన్న వారి ఆదేశాలు.. ఉమర్‌కు ఎలా అందాయి అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. లేదంటే ఉమర్ వద్ద మరో ఫోన్ ఉందా? ఈ పేలుడులో ఆ ఫోన్ ధ్వంసమైందా? అని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సైతం దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోండి.. హెచ్​-1బీ వీసాలపై ట్రంప్‌ కొత్త స్వరం

రెండోసారి చోరికి వచ్చి.. జనానికి దొరికిపోయిన దొంగలు

ఆ రోడ్డు కింద 5 వేల టన్నుల బంగారం.. ఎక్కడంటే ??

ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా.. హైవేలపై QR కోడ్​ బోర్డులు

వింత ఘటన.. గేదెకు ఒకే ఈతలో రెండు లేగ దూడలు