Fetus: క్యారెట్‌ తింటే నవ్వుతున్నారు..! గర్భస్థ శిశువులకూ రుచులు.. అవును ఇది నిజమే.. కావాలంటే మీరే చూడండి.

నచ్చిన ఆహారం మనముందుంటే వావ్‌ అంటూ మురిసిపోతాం. అదే ఇష్టంలేని వంటకం చూస్తే ఇప్పుడు ఇది తినాలా..? అని మొహం చిట్లిస్తాం. ఈ ఫీలింగ్‌ మనకే కాదండోయ్‌..! ఇంకా

Fetus: క్యారెట్‌ తింటే నవ్వుతున్నారు..!  గర్భస్థ శిశువులకూ రుచులు.. అవును ఇది నిజమే.. కావాలంటే మీరే చూడండి.

|

Updated on: Oct 01, 2022 | 9:00 PM


నచ్చిన ఆహారం మనముందుంటే వావ్‌ అంటూ మురిసిపోతాం. అదే ఇష్టంలేని వంటకం చూస్తే ఇప్పుడు ఇది తినాలా..? అని మొహం చిట్లిస్తాం. ఈ ఫీలింగ్‌ మనకే కాదండోయ్‌..! ఇంకా ఈ భూమ్మీద పడని, గర్భస్థ శిశువులు కూడా ఈ తేడాను గుర్తిస్తారట. ఈ దిశగా జరిగిన తొలి అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డర్హమ్ ఫీటల్‌ నియోనేటల్‌ రిసెర్చ్‌ ల్యాబ్ జరిపిన ఈ పరిశోధన సేజ్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. పరిశోధకులు ఇంగ్లండ్‌కు చెందిన 100 మంది గర్భిణులపై ఈ అధ్యయనం చేపట్టారు. వారికి రెండు రకాల ఆహారాన్ని పొడిచేసి క్యాప్సూల్‌ రూపంలో అందించారు. వారిలో ఒక గ్రూప్‌కు క్యాబేజీ వర్గానికి చెందిన క్యాప్సూల్‌ను అందివ్వగా, మరో గ్రూప్‌ క్యారెట్‌తో సిద్ధం చేసిన క్యాప్సూల్‌ తీసుకుంది. తల్లులు వాటిని తీసుకున్న 20 నిమిషాల తర్వాత గర్భస్థ శిశువుల ముఖకవళికలను పరిశోధకులు గమనించారు.ఇందుకోసం 4డీ ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ను ఉపయోగించారు. క్యాబేజీ ఫ్లేవర్ తగిలిన శిశువులు చాలామటుకు మొహాన్ని చిట్లించగా.. క్యారెట్‌ రుచి చూసిన శిశువుల మొహంపై చిరునవ్వు కనిపించింది. ఇలా గర్భస్థ శిశువులకు పదేపదే నిర్దిష్ట ఆహారాలను పరిచయం చేయడం వల్ల.. భవిష్యత్తులో వారి ఆహార ప్రాధాన్యతలకు ఇదొక కారకంగా ఉంటుందని అంచనా వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us