Nose ring: నోస్‌ రింగ్‌ ఐదేళ్ల కిందట కోల్పోయాడు.. ఊపిరితిత్తుల్లో కనుగొన్న డాక్టర్లు.. స్కానింగ్ లో మరో షాక్..

Nose ring: నోస్‌ రింగ్‌ ఐదేళ్ల కిందట కోల్పోయాడు.. ఊపిరితిత్తుల్లో కనుగొన్న డాక్టర్లు.. స్కానింగ్ లో మరో షాక్..

Anil kumar poka

|

Updated on: Oct 01, 2022 | 9:44 PM

ముక్కుకు ధరించే రింగ్‌ను ఒక వ్యక్తి ఐదేళ్ల కిందట కోల్పోయాడు. అయితే ఇటీవల అతడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ రింగ్‌ అతడి ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.


ముక్కుకు ధరించే రింగ్‌ను ఒక వ్యక్తి ఐదేళ్ల కిందట కోల్పోయాడు. అయితే ఇటీవల అతడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ రింగ్‌ అతడి ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సర్జరీ ద్వారా దానిని బయటకు తీశారు. అరుదైన ఈ సంఘటన అమెరికాలో జరిగింది.35 ఏళ్ల జోయ్ లికిన్స్, తన ముక్కుకు రింగ్‌ ధరించేవాడు. ఐదేళ్ల కిందట అతడు నిద్ర నుంచి లేచిన తర్వాత అది కనిపించలేదు. మంచం అంతటా వెతికినా ఫలితం లేకపోయింది. ఒకవేళ పొరపాటున మింగి ఉంటానని అతడు అనుకున్నాడు. ఆ నోస్‌ రింగ్‌పై ఆశలు వదులుకున్నాడు. తాజాగా జోయ్ లికిన్స్‌కు బాగా దగ్గు వచ్చింది. దగ్గుతున్నప్పుడు వెనక వైపు చాలా నొప్పిగా అనిపించింది. దీంతో అతడ్ని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారు. నిమోనియా లక్షణాలుగా తొలుత వైద్యులు భావించారు. అయితే ఎక్స్‌ రే తీసిన తర్వాత వారికి అసలు విషయం తెలిసింది. కుడి ఊపిరితిత్తు పైభాగంలో అతడు పోగొట్టుకున్న నోస్‌ రింగ్ ఉంది. ఈ ఎక్స్‌ రే చూసి లికిన్స్‌ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ నోస్‌ రింగ్‌ కోసం తాను తెగ వెతికానని చెప్పాడు. చివరకు తన ఊపిరితిత్తుల్లోకి అది చేరుకున్నట్లు తెలుసుకుని షాక్‌ అయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 01, 2022 09:44 PM