Cryonics mortality: చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడంటున్న సంస్థ.. భద్రంగా మృతదేహాలు దాచిపెడుతున్న కంపెనీ..!

ఎవరైనా చనిపోయినా తర్వాత మళ్లీ బతికి రావడం వంటి వాటిని సినిమాల్లోనే మాత్రమే చూస్తాం. నిజ జీవితంలో అది అసాధ్యం. కానీ సాధ్యం చేయాలనకుంటున్నారు అమెరికాకు చెందిన అల్కోర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ.

Cryonics mortality: చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడంటున్న సంస్థ.. భద్రంగా మృతదేహాలు దాచిపెడుతున్న కంపెనీ..!

|

Updated on: Dec 03, 2022 | 5:52 PM


ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్‌ లైన్‌ అనే వ్యక్తులు స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగి బతికివస్తారనే ఆశతో జాగ్రత్తగా వారి మృతదేహాలను కాపాడతున్నారు. క్రయో ప్రెజర్వ్‌ అనే విధానం ద్వారా చనిపోయిన వారిని లిక్విడ్‌ నైట్రోజన్‌తో నిండిన స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ట్యాంకులో ఉంచుతారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద దశాబ్దాల పాటు జాగ్రత్తగా భద్రపరుస్తారు. వాళ్లు భవిష్యత్తులో ఏనాటికైనా మేల్కొనేలా సాంకేతిక వైద్యం అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారట. అందుకోసం ఒక్క మృతదేహానికి సుమారు కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందట. కేవలం రోగి మెదడుని మాత్రం క్రయో ప్రిజర్వ్‌ చేయాలంటే దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చవుతుందని సంస్థ తెలిపింది. తొలిసారిగా 2015లో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్ మృతదేహాన్ని భద్రపరిచారు. రెండేళ్ల వయస్సులో క్రయో ప్రెజర్వ్‌ చేసిన పిన్న వయస్కురాలు ఈమె కావడం విశేషం. ఈ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు, ఆమెకు మెదడుకు సంబంధించిన ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు గానీ ప్రయోజనం లేకపోవడంతో యూఎస్‌లోని అల్కోర్‌ ఫౌండేషన్‌ని సంప్రదించి క్రయో ప్రిజర్వ్‌ చేశారు. అలా బిట్‌కాయిన్‌ మార్గదర్శకుడు హాల్‌ ఫిన్నీ, 2014లో మృతి చెందిన తర్వాత క్రయో ప్రిజర్వ్‌ చేశారు. ప్రస్తుతానికి ఈ సంస్థలో సుమారు 199 మంది మానవులను, దాదాపు 100 పెంపుడు జంతువులను క్రయో ప్రిజర్వ్‌ చేశారు. ఇక ఇప్పటివరకు 500 మంది వ్యక్తుల శరీరాలను క్రయో ప్రిజర్వ్‌ చేయడానికి ఈ సంస్థను సంప్రదించారని చెబుతున్నారు ఫౌండేషన్‌ అధికారులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us