ఈ బాలుడి కథ వింటే మీకు కన్నీళ్లు ఆగవు..! వీడియో

బ్రెజిల్‌కు చెందిన ఓ పిల్లవాడి ఫోటో ఒకటి ప్రపపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న బాలుడి కథ విన్న నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Phani CH

|

Jan 04, 2022 | 8:25 AM

బ్రెజిల్‌కు చెందిన ఓ పిల్లవాడి ఫోటో ఒకటి ప్రపపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న బాలుడి కథ విన్న నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ పోటోలో ముగ్గురు పిల్లలు వయొలిన్‌ వాయిస్తున్నారు. అందులో ఒక పిల్లవాడు బ్రెజిల్‌కు చెందినవాడు. ఆ కుర్రవాడు తనకు మంచి జీవితాన్నిచ్చిన గురువు చనిపోవడంతో ఆ పసిహృదయం తట్టుకోలేకపోయింది. తన గురువు పార్దివ దేహానికి అంత్య క్రియలు నిర్వహిస్తున్న సమయంలో వీడ్కోలు పలుకుతూ వయొలిన్‌ వాయించారు ఆ చిన్నారులు. ఈ క్రమంలో తనను నేరపూరిత జీవితంనుంచి బయటకు తీసుకొచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన తన గురువును కోల్పోవడంతో ఆ చిన్నారి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కన్నీటితోనే వయొలిన్‌ వాయిస్తూ తిరిగిరాని తన గురువుకు అంతిమ వీడ్కోలు పలికాడు. హృదయాన్ని మెలిపెట్టేలా ఏడుస్తున్న ఆ చిన్నారి ఫోటోను అవ్నీష్‌ షరన్‌ అనే ఐఏఎస్‌ ఆఫీసర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

News Watch: ఒమిక్రాన్ ని పక్కన పెట్టండి.. కరోనా సంగతేంటి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu