Bill Gates: మరీ ఇంత మంచితనమైతే ఎట్టయ్య.. రూ.1,50,000 కోట్ల విరాళం.. సంపన్నుల జాబితా నుంచి బయటకు..
బిగ్ గేట్స్ మరోసారి మంచి మనస్సును చాటుకున్నారు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరో 20 బిల్లియన్ డాలర్లు అంటే లక్షన్నర కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి
బిగ్ గేట్స్ మరోసారి మంచి మనస్సును చాటుకున్నారు. దాతృత్వ కార్యక్రమాల కోసం మరో 20 బిల్లియన్ డాలర్లు అంటే లక్షన్నర కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి అభినవ కర్ణుడిగా చాటుకున్నారు. తన సంపద నుంచి ఈ మొత్తాన్ని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళమివ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. బిల్ గేట్స్, ఆయన మాజీ భార్య మెలిండా కలిసి గత 22 ఏళ్లుగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేటు ఛారిటబుల్ ఫౌండేషన్లలో ఒకటి. ప్రజారోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం కోసం ఆ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోట్లాది రూపాయలతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు తాను ప్రకటించిన తాజా విరాళాలు దోహదపడతాయని తన పర్సనల్ బ్లాగ్‌లో బుధవారం ఆయన పేర్కొన్నారు. సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే తాను బయటకు రానున్నట్లు తెలిపారు.కోవిడ్-19 పాండమిక్, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులను ప్రస్తావిస్తూ.. నేటి తరం అతిపెద్ద సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్నిఅధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మరింత ఉదారతను చాటుకోవాల్సిన అవసరముందని అన్నారు. ద్రవ్యోల్భణం భారీగా పెరడంతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పేదరిక నిర్మూలనకు తమ ఫౌండేషన్ మరింత చేయాల్సి ఉందని పేర్కొన్నారు.బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు గత నెల ప్రపంచ కుబేరుడు వారెన్ బఫె 3.1 బిల్లియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. బిల్ గేట్స్ ఇప్పుడు ప్రకటించిన 20 బిల్లియన్ డాలర్ల విరాళాలను కలుపుకుని ఆ ఫౌండేషన్ నిధులు 70 బిల్లియన్ డాలర్లకు చేరుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..