Aliens in Sky: ఆకాశంలో ఏలియన్స్ చక్కర్లు.. ఇదిగో ప్రూఫ్ అంటూ షాక్‌లో అమెరికా ప్రజలు..!
ఏలియన్స్ ఉన్నారా లేదా..? ఉంటే ఏ గ్రహం మీద ఉంటారు..? మనతో వాళ్లు మాట్లాడతారా..? ఎప్పుడు.. ఎలా..?..!!! గ్రహాంతర అన్వేషణలో భాగంగా కొన్ని శతాబ్ధాలుగా నలుగుతున్న ప్రశ్నలివి..!
ఏలియన్స్ ఉన్నారా లేదా..? ఉంటే ఏ గ్రహం మీద ఉంటారు..? మనతో వాళ్లు మాట్లాడతారా..? ఎప్పుడు.. ఎలా..?..!!! గ్రహాంతర అన్వేషణలో భాగంగా కొన్ని శతాబ్ధాలుగా నలుగుతున్న ప్రశ్నలివి..!! తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అమెరికాలోని కాలిఫొర్నియాలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కనిపించినట్లుగా ఇద్దరు వ్యక్తులు తెలిపారు. తాము పట్ట పగలు వాటిని చూశామని.. బహుశా అది గ్రహాంతరవాసుల వాహనమని అభిప్రాయపడుతున్నారు. జులై 10న కాలిఫొర్నియాలోని మెన్లో పార్క్ సమీపంలో పట్టపగలే UFO కనిపించిందని స్థానికంగా నివసిస్తున్న ఓ ఫ్యామిలీ తెలిపింది. ఓ యువకుడితో పాటు అతడి తల్లి ఆకాశంలో యూఎఫ్‌వోను చూశారట. ఓ రోజు సాయంత్రం సమయంలో ఉన్న పళంగా ఆకాశంలో ఏదో వింత వస్తువు.. గాల్లో కనిపించిందని.. దాదాపు 15 నిమిషాల పాటు అటూ ఇటూ తిరిగిందని వారు తెలిపారు. కాసేపటి తర్వాత మాయమైందని.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని వెల్లడించారు. ఆ దృశ్యాలను తాము వీడియో తీసినట్లు చెప్పారు. ఆకాశంలో వలయాకారంలో కదులుతున్న ఆ వస్తువును చూసి.. స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అవి గ్రహాంతరవాసులే అయి ఉండవచ్చని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..