AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు

Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు

Phani CH
|

Updated on: Sep 26, 2025 | 3:49 PM

Share

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం ఉన్నట్టుండి రోడ్డు దిగబడి భారీ గొయ్యి ఏర్పడింది. కాసేపటికే రోడ్డులోని మరికొంత భాగం గుంతలో పడింది. . గొయ్యి విస్తరిస్తూ పోయి 50 అడుగుల లోతు వద్ద ఆగింది. రోడ్డు చివరన ఉన్న ఓ కారు గొయ్యిలో పడిపోయింది. కళ్ల ముందు రోడ్డు కుంగిపోవడం చూసి వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు.

తమ కార్లను వెనక్కు పోనిచ్చారు. పైపులు పగిలి నీరు బయటకు ఎగజిమ్మింది. ఓ విద్యుత్‌ స్తంభం కొంత భాగం భూమితో పాటు సింక్‌ హోల్‌లో కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్‌స్టేషన్‌ను, ఆస్పత్రి ఔట్‌పేషెంట్‌ వార్డును మూసేశారు. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై ఏర్పడ్డ పేద్ద సింక్‌హోల్‌ కారణంగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. గొయ్యిలో పడిన ఓ కారును క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. మెయిన్ రోడ్డు సమీపంలోనే భూగర్భ రైల్వేస్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు మీద భారీ గొయ్యి ఏర్పడడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతేకాదు రోడ్డు సమీపంలోని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. గతేడాది హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అలాగే కొన్నేళ్ల క్రితం పంజాగుట్టలోని మోడల్‌ హౌస్‌ వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. రోడ్డులో కొంత భాగం దిగిపోయిపెద్ద గొయ్యి ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమై ఇతరులకు ప్రమాదాలు జరగకుండా వెంటనే బారికేడ్‌లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. భూమి ఉపరితలం అకస్మాత్తుగా కుంగినప్పుడు సింక్‌ హోల్‌ ఏర్పడటం చూస్తాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే

కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్‌

ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం

Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు