ల్యాండింగ్‌ సమయంలో ఊగిన విమానం .. ఎందుకంటే ??

ల్యాండింగ్‌ సమయంలో ఊగిన విమానం .. ఎందుకంటే ??

Phani CH

|

Updated on: Jan 02, 2024 | 9:59 AM

బ్రిటన్‌లో ఈదురుగాలుల ప్రభావంతో ల్యాండింగ్‌ సమయంలో ఓ విమానం ప్రమాదకరంగా ఊగింది. విమానానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డిసెంబరు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్‌, ఐర్లాండ్‌ దేశాలను గెరిట్‌ తుపాను తాజాగా వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఈ దేశాల్లో విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. లాస్‌ఏంజెలెస్‌ నుంచి వచ్చిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 777 విమానం.. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య దిగింది.

బ్రిటన్‌లో ఈదురుగాలుల ప్రభావంతో ల్యాండింగ్‌ సమయంలో ఓ విమానం ప్రమాదకరంగా ఊగింది. విమానానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డిసెంబరు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్‌, ఐర్లాండ్‌ దేశాలను గెరిట్‌ తుపాను తాజాగా వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఈ దేశాల్లో విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. లాస్‌ఏంజెలెస్‌ నుంచి వచ్చిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 777 విమానం.. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య దిగింది. రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా ఈదురు గాలుల ప్రభావంతో విమానం విపరీతంగా ఊగిపోయింది. విమానం రెక్క ఒకవైపు ఒరిగి దాదాపు నేలను తాకబోయింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 10 సెకన్ల పాటు కుదుపులకు గురైంది విమానం. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దింపాడు. గెరిట్‌ తుపాను కారణంగా 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తుండటంతో హీత్రూ, గ్లాస్గో విమానాశ్రయాలలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యరాముడి అభిషేకానికి ప్రత్యేక కలశాలు

Prabhas: సలార్ సక్సెస్ పై రెబల్ స్టార్ క్రేజీ పోస్ట్‌

మహేష్‌ను ఏంటి.. మగజాతి మొత్తాన్ని మడతెట్టేసిందిగా…

Sai Pallavi: అందరు హీరోయిన్లలా కాదు.. ఎంతైనా ఈమె వేరబ్బా…

ఒక్క ఫోటోతో.. తన ప్రేమను చెప్పేసిన సూపర్ స్టార్