Israel – Hamas: 8 నెలల తర్వాత ఇజ్రాయెల్ బందీలు ముగ్గురికి విముక్తి..
హమాస్ చెరలో 8 నెలలుగా బందీగా ఉన్న ఇజ్రాయెలీ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉగ్రవాదుల చెర నుంచి ఆమెను విడిపించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడిన హమాస్ ఉగ్రవాదులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడిచేసి ఎంతోమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
హమాస్ చెరలో 8 నెలలుగా బందీగా ఉన్న ఇజ్రాయెలీ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉగ్రవాదుల చెర నుంచి ఆమెను విడిపించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడిన హమాస్ ఉగ్రవాదులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడిచేసి ఎంతోమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారిలో నోవా అగ్రమని, ఆమె బాయ్‌ఫ్రెండ్ అవినాట్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులు నోవాను బలవంతంగా మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టి గాజా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో పెను సంచలనమైంది. నోవా తల్లి అప్పటికే బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు.
కుమార్తె ఉగ్రవాదుల చెరలో బందీగా ఉందన్న విషయం తెలిసిన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం సెంట్రల్ గాజాలోని నుసీరత్‌లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా నోవా సహా మరో ముగ్గురు బందీలను విడిపించింది. అనంతరం నోవాను టెల్ అవీవ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 8 నెలలపాటు వారి చెరలో బందీగా మగ్గిపోయిన నోవా.. కళ్ల ముందు కనిపించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

