Fire in Airplane: గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు..విమానంలో 400 మంది..

Fire in Airplane: గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు..విమానంలో 400 మంది..

Anil kumar poka

|

Updated on: Jun 10, 2024 | 9:37 AM

ఇటీవల తరచూ విమానాల్లో బెదిరింపులు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు చేస్తూ వాష్‌ రూమ్‌లో టిష్యూ పేపర్‌ దొరికిన సంఘటనలు కలకలం రేపాయి. తాజాగా ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌ విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్‌ 5న కెనడాలోని టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది.

ఇటీవల తరచూ విమానాల్లో బెదిరింపులు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు చేస్తూ వాష్‌ రూమ్‌లో టిష్యూ పేపర్‌ దొరికిన సంఘటనలు కలకలం రేపాయి. తాజాగా ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌  విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. జూన్‌ 5న కెనడాలోని టొరంటో పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా విమానం రెక్కల వద్ద మంటలు చెలరేగాయి. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌లు గాల్లోకి లేచిన 30 నిమిసాల్లోనే విమానాన్ని పియర్సన్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. దీంతో విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు జరిగి మంటలంటుకున్న సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 400 మంది వరకూ ఉన్నారు. ఘటన జరిగినపుడు విమానంలో ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయి. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విమానాన్ని సురక్షితంగా వెనక్కు మళ్లించి ల్యాండ్‌ చేసిన పైలట్‌లను అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.