AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport: కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు..  200 విమాన సర్వీసులు ఆలస్యం.

Airport: కొంపముంచిన కత్తెర.. 36 విమానాలు రద్దు.. 200 విమాన సర్వీసులు ఆలస్యం.

Anil kumar poka
|

Updated on: Aug 24, 2024 | 6:06 PM

Share

సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవడం, ఇతరత్రా భద్రతా కారణాలతో విమాన సర్వీసులు రద్దవడమో లేదా ఆలస్యమవడమో చూస్తుంటాం. కానీ ఓ కత్తెర కారణంగా విమానాలు రద్దవడం ఎక్కడైనా చూశారా? అసలు ఇలాంటి వార్త విన్నారా? జపాన్‌లో అదే జరిగింది. కనిపించకుండా పోయిన ఓ కత్తెర కారణంగా ఏకంగా 36 విమానాలను రద్దు చేశారు. వందల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవడం, ఇతరత్రా భద్రతా కారణాలతో విమాన సర్వీసులు రద్దవడమో లేదా ఆలస్యమవడమో చూస్తుంటాం. కానీ ఓ కత్తెర కారణంగా విమానాలు రద్దవడం ఎక్కడైనా చూశారా? అసలు ఇలాంటి వార్త విన్నారా? జపాన్‌లో అదే జరిగింది. కనిపించకుండా పోయిన ఓ కత్తెర కారణంగా ఏకంగా 36 విమానాలను రద్దు చేశారు. వందల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

జపాన్‌ లోని అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ఇటీవల వందల సంఖ్యలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. మరి దీనికి కారణమేంటో తెలుసా?.. ఓ కత్తెర కన్పించకపోవడమే. ఇది తెలుసుకొని ప్రయాణికులు అవాక్కయ్యారు. హక్కైడో ద్వీపంలో గల న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 17న ఓ రిటైల్‌ స్టోర్‌ నుంచి కత్తెర కన్పించకుండా పోయింది. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రతా తనిఖీలను ఆపి మరీ.. దాదాపు రెండు గంటల పాటు కత్తెర కోసం ప్రతి అంగుళం వెదికారు. దీని కారణంగా 36 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. మరో 201 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందిస్తూ.. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరను దొంగిలించినట్టయితే, దాన్ని ఆయుధంగా చేసుకొనే అవకాశం ఉందన్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. చివరకు ఆ కత్తెర కన్పించకుండా పోయిన దుకాణంలోనే ఉందట. అక్కడే అది దొరికిందట. ఆ స్టోర్‌లో మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాలు ఆలస్యం కావడంతో వారు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. కొందరైతే చేసేదేం లేక తిరిగి వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జపాన్‌ రవాణా మంత్రిత్వశాఖ ఎయిర్‌పోర్టు అధికారులను ఆదేశించింది. 1988లో ప్రారంభించిన ఈ న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌.. హక్కైడోలో అతి పెద్దది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడ భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ కఠినంగా ఉంటాయని పేరుంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.