Starbucks CEO: ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!

Starbucks CEO: ఆఫీసుకెళ్లేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కేటాయించిన కంపెనీ.!

Anil kumar poka

|

Updated on: Aug 24, 2024 | 5:00 PM

డ్యూటీ కోసం పక్క ఊళ్లకు వెళ్లేవారిని చూస్తుంటాం. ఏ వంద కిలోమీటర్లో అయితే రోజు ట్రైన్‌లో అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తారు. అంతకుమించి అయితే చాలామంది ఆ ఊర్లోనే అద్దెకు ఉండిపోతారు. కానీ, అమెరికాలోని స్టార్‌బక్స్‌ కంపెనీ సీఈవో మాత్రం 1600 కిలోమీటర్లు ప్రయాణించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందుకు ప్రైవేట్‌ జెట్‌ని రెడీ చేసుకున్నారట. అమెరికా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్‌కి సీఈవోగా బ్రయన్‌ నికోల్‌ కొత్తగా అపాయింట్‌ అయ్యారు.

డ్యూటీ కోసం పక్క ఊళ్లకు వెళ్లేవారిని చూస్తుంటాం. ఏ వంద కిలోమీటర్లో అయితే రోజు ట్రైన్‌లో అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తారు. అంతకుమించి అయితే చాలామంది ఆ ఊర్లోనే అద్దెకు ఉండిపోతారు. కానీ, అమెరికాలోని స్టార్‌బక్స్‌ కంపెనీ సీఈవో మాత్రం 1600 కిలోమీటర్లు ప్రయాణించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందుకు ప్రైవేట్‌ జెట్‌ని రెడీ చేసుకున్నారట. అమెరికా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్‌కి సీఈవోగా బ్రయన్‌ నికోల్‌ కొత్తగా అపాయింట్‌ అయ్యారు. ఏటా 1.6 మిలియన్‌ డాలర్లు ఆయనకు శాలరీ రూపంలో ఇవ్వడంతోపాటు బోనస్‌గా 3.6 మిలియన్‌ డాలర్ల నుంచి 7.2 మిలియన్‌ డాలర్లు ఆయన అందుకునే అవకాశం ఉంది. ఇవేకాకుండా వార్షిక అవార్డ్‌ కింద 23 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు, ఆయన ప్రయాణానికి జెట్‌ కూడా ఇవ్వనున్నారు. ఇలాంటి ప్రయాణ ఒప్పందం గతంలో ఆయన 2018లో చిపోటిల్‌ సంస్థతో కూడా చేసుకొన్నారు. కంపెనీ భాగస్వాముల కార్యాలయాలను విజిట్‌ చేయడం, స్టోర్లలో కస్టమర్లతో మాట్లాడటం, రోస్టింగ్‌ ఫెసిలిటీలను తనిఖీ చేయడం, ప్రపంచంలోని వివిధ బ్రాంచిలను సందర్శించడం బ్రయన్ నికోల్‌ ప్రధాన డ్యూటీలో భాగం. ప్రస్తుతం నికోల్‌ కాలిఫోర్నియాలోని ఇంట్లో ఉంటున్నారు. ఇక స్టార్‌బక్స్‌ ప్రధాన కార్యాలయం సియాటెల్‌లో ఉంది. దీంతో అతనికి ప్రత్యేక విమానం సిద్ధమైంది. కంపెనీ హైబ్రిడ్‌ వర్క్‌ పాలసీ ప్రకారం వారంలో కనీసం మూడు రోజులు సియాటెల్‌ నుంచి ఆయన పని చేయనున్నారు. దాంతో తన ఇంటి నుంచి 1,600 కిలోమీటర్ల దూరంలోని కార్పొరేట్‌ ఆఫీస్‌కు రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కార్పొరేట్‌ జెట్‌ కూడా సిద్దం చేసింది స్టార్‌బక్స్‌ కంపెనీ.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.