బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం
వీధిలో గొడవ జరుగుతుంటే ఓ మహిళ బంగ్లా పైనుంచి చూసింది. కింద కొట్లాడుకుంటున్న యువకులలో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గురితప్పి బంగ్లాపై ఉన్న మహిళకు తాకింది. నార్త్ ఢిల్లీలోని దయాళ్ పూర్ లో శనివారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బ్రిజ్ పురికి చెందిన హషీం, బబ్లూల మధ్య జరిగిందీ గొడవ. హషీం ఇటీవల బబ్లూకు 17 వేల రూపాయలు అప్పు ఇచ్చాడు.
వీధిలో గొడవ జరుగుతుంటే ఓ మహిళ బంగ్లా పైనుంచి చూసింది. కింద కొట్లాడుకుంటున్న యువకులలో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గురితప్పి బంగ్లాపై ఉన్న మహిళకు తాకింది. నార్త్ ఢిల్లీలోని దయాళ్ పూర్ లో శనివారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బ్రిజ్ పురికి చెందిన హషీం, బబ్లూల మధ్య జరిగిందీ గొడవ. హషీం ఇటీవల బబ్లూకు 17 వేల రూపాయలు అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న బబ్లూ శనివారం దయాళ్ పూర్ లో హషీంకు తారసపడ్డాడు. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని అక్కడే గట్టిగా నిలదీశాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఇద్దరూ గొడవపడుతుండగా బబ్లూ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. నలుగురూ కలిసి హషీంపై దాడికి దిగారు. వీధిలో అరుపులు వినిపించడంతో ఏం జరుగుతోందని పక్కనే ఉన్న బిల్డింగ్ పైనుంచి ఓ మహిళ తొంగిచూసింది. ఇంతలో కోపం పట్టలేక బబ్లూ అనుచరుడు కమ్రూల్ తన దగ్గరున్న తుపాకీ తీసి హషీంపై కాల్పులు జరపగా.. బుల్లెట్ మిస్ ఫైర్ అయి నేరుగా మహిళను తాకింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు
ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్ ??
గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు
పోలీసులా ?? అయితే మాకేంటి ?? ఇది… హైదరాబాద్ పబ్‌ల తీరు
నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

