40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు

రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో నలభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది ఈ నిత్య పెళ్లకూతురు. ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారణం తమినాడులో జరిగింది. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది.

40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు

|

Updated on: Jul 10, 2024 | 7:17 PM

రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో నలభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది ఈ నిత్య పెళ్లకూతురు. ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారణం తమినాడులో జరిగింది. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది. తమిళనాడు- తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు గమనించాడు. ఆధార్‌లో భర్త పేరు కనిపించడంతో యువకుడు ఆమెను ప్రశ్నించాడు. బయటకు చెప్తే యువకుడిని చంపేస్తానని మహిళ బెదిరించింది. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించిన యువకుడు అసలు విషయం తెలిసి షాకయ్యాడు. సంధ్య ఇప్పటికే 39 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. ఆమె వలలొ డీఎస్పీ, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారని తెలిసి అవాక్కవ్వడం పోలీసుల వంతయింది. మొత్తం మీద ఇంత మందిని మోసం చేసిన ఈ యువతిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

ఈ పురుగు ఖరీదు రూ. 75 లక్షలు.. ఎందుకంత స్పెషల్‌ ??

గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు

పోలీసులా ?? అయితే మాకేంటి ?? ఇది… హైదరాబాద్ పబ్‌ల తీరు

Follow us