Humanity: మీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే.. మానవత్వం మరుస్తున్న యువత.. ట్రెండ్ మారుస్తున్న వీడియో…
చదువు సంస్కరాన్ని ఇతరుల కష్టాన్ని అర్ధం చేసుకుని..సాయం చేసే గుణం ఇవ్వక పొతే.. ఎన్ని చదువులు చదివి.. ఎన్ని డిగ్రీలు సంపాదించా..అవి వ్యర్ధమే. అందుకు ఉదాహరణే ఈ వీడియో..
చదువు సంస్కరాన్ని ఇతరుల కష్టాన్ని అర్ధం చేసుకుని..సాయం చేసే గుణం ఇవ్వక పొతే.. ఎన్ని చదువులు చదివి.. ఎన్ని డిగ్రీలు సంపాదించా..అవి వ్యర్ధమే. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఈ వీడియోలో చీర కట్టుకున్న ఓ మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తుంది. అయితే ఆ మహిళ చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని.. నేలమీద కూర్చుంది. అది చూసి… ట్రైన్ లో సీట్లపై కూర్చున్న ఏ ఒక్కరి హృదయం కరగలేదు.. తమకు పట్టనట్లు.. కొందరు సెల్ చూస్తూ.. మరికొందరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చిన్నారితో నేలపై కూర్చున్న ఆ మహిళకు సీటు ఇవ్వడం తమ ధర్మమని ఏ ఒక్కరికీ అనిపించలేదు.. ఒక్కరు కూడా ఆ మహిళవైపు దృష్టి సారించలేదు.ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకి ‘నీ ప్రవర్తనలో కరుణ కనిపించకపోతే నీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో లక్షలమంది వీక్షించారు. కొన్ని వందల మంది కామెంట్స్ చేశారు. ఈ వీడియో తీసిన వ్యక్తి.. కూడా ఆ మహిళకు తన సీటు ఇవ్వచ్చు.. కానీ ఇలాంటి వ్యక్తులు కేవలం వీడియో తీసి వైరల్ చేయడానికి మాత్రమే పనికివస్తారు.. ఇది చాలా అవమానకరం, దురదృష్టకరమని.. దీనిని మనమందరం గుర్తుంచుకోవాలంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..